టాలీవుడ్ యంగ్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత విడిపోయారు. కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న విడాకుల రూమర్స్ నిజమేనని స్వయంగా అక్కినేని నాగ చైతన్య తన ట్విట్టర్ కౌంట్ ద్వారా ప్రకటించారు. సమంతతో విడాకులు తీసుకున్నట్లుగా లేఖను ట్వీట్ చేశారు. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని.. ఈ క్లిష్ట సమయంలో తన వెంట ఉండాలని ఆయన అభిమానుల్ని కోరారు. [
Also Read : సమంతతో కలిసి నటించాలనుకుంటున్న బాలీవుడ్ స్టార్..
టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా సమంత - నాగ చైతన్య విడాకుల అంశం హాట్ టాపిక్‌గా మరింది. వీరు ఎక్కడా జంటగా కనిపించడం లేదు. రెండు నెలల కిందట తన సోషల్ మీడియా పోస్టుల్లో అక్కినేని అనే ఇంటి పేరును సమంత తీసేశారు. అయితే సినిమా ప్రమోషన్ల కోసం అలా చేశారేమో అలా మంది అనుకున్నారు. కానీ కుటుంబంలో గొడవలు ఉన్నాయని ఎవరూ అనుకోలేదు. అప్పటి వరకూ వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
Also Read : జోరు వానలో దూసుకెళ్తున్న సామ్ సైకిల్...ఎంజాయ్ చేస్తున్న నటి
అయితే అప్పట్నుంచి సమంత, నాగ చైతన్య జంటగా కనిపించడం మానేశారు. ఎవరి దారి వారిది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విడివిడిగా కనిపిస్తూండటంతో కుటుంబ కార్యక్రమాల్లోనూ సమంత పాల్గొనకపోతూండటంతో వారిద్దరి మధ్య నిజంగానే విభేదాలు వచ్చాయన్న ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో ఈ అంశంపై స్పందించేందుకు ఇద్దరిలో ఎవరూ ఆసక్తి చూపించలేదు.అయితే ఇద్దరూ రూమర్స్‌ని ఖండించలేదు.
Also Read : ఫెమీనా ఫ్యాబులస్ 40 లో చోటు దక్కించుకున్న సామ్, నయన్..
పెద్దవాళ్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఈ జంట మధ్య ఇటీవల అభిప్రాయబేధాలు పరిష్కరించుకోనంతగా పెరిగిపోయాయని తెలుస్తోంది. దీంతో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం . ఇద్దరికీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయితే వీరిద్దరూ కలిసి ఉండటానికి అంగీకరించలేదు. ఇప్పటికే సమంత- చైతన్య ఇద్దరూ విడిగానే ఉంటున్నారు. ఈ క్రమంలో అధికారికంగా విడాకులు మంజూరు అయినట్లుగా తెలుస్తోంది. అందుకే నాగ చైతన్య, సమంత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
Also Read : ఆ వార్తల్లో నిజం లేదు.. అవి చూసి చాలా బాధపడ్డా: నాగ చైతన్య
సమంత కూడా ఈ విడాకులను కన్ఫామ్ చేసింది. నాగ చైతన్య పోస్ట్ చేసిన తరహాలోనే ఉన్న స్టేట్‌మెంట్‌ను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. వివాహ బంధానికి స్వస్తి పలికామని, అయితే తమ పదేళ్ల స్నేహం అలాగే కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చింది.
Also Read : ఆమిర్ ఖాన్ తో అక్కినేని ఫ్యామిలీ డిన్నర్ పార్టీ.. సమంత ఎక్కడ..? అంటూ నెటిజన్ల ప్రశ్నలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి