Nellore Police Family Counseling: దిశ చట్టం అమలులోకి రాలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా.. దిశ యాప్ ద్వారా ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న ఆడవారికి వెంటనే పోలీసుల రక్షణ కల్పించగలిగారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే దిశ యాప్ వల్ల చాలామంది రక్షణ పొందిన ఉదాహరణలున్నాయి. తాజాగా నెల్లూరు నగరానికి చెందిన కుద్దూస్ నగర్ లో నివశిస్తున్న ఓ కుటుంబం దిశ పోలీసుల వల్ల లబ్ధిపొందింది. కుటుంబ కలహాల (Family Conflict Counselling Services in Nellore)తో భార్యా భర్తలు విడిపోయే పరిస్థితి నుంచి ఆ కథ సుఖాంతమైంది. ఇటీవల కాలంలో దిశ పోలీసుల వల్ల చాలా వరకు కేసులు త్వరగా పరిష్కారం అవుతున్నాయి. కోర్టుల వరకు వెళ్లాల్సిన వ్యవహారాలన్నీ వెంటనే చక్కబడుతున్నాయి. 


అసలేం జరిగింది..?
నెల్లూరు నగరంలోని కుద్దూస్ నగర్ లో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు నివసిస్తున్నారు. అయితే భర్త, భార్య మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు పెద్దవయ్యే క్రమంలో పిల్లల భవిష్యత్తు గురించి తల్లి తల్లడిల్లిపోయింది. వెంటనే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసింది. జిల్లా ఎస్పీ విజయరావు స్పందన కార్యక్రమంలో భాగంగా తన ఫోన్ నెంబర్ ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు. స్పందన జరిగే రోజే బాధితురాలు ఫోన్ చేయడంతో వెంటనే ఎస్పీ స్పందించారు. దిశ పోలీసులకు సమాచారమిచ్చారు. 




నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్ కి ఎస్పీ నుంచి ఫోన్ రావడంతో వారు కంగారుపడ్డారు. వెంటనే బాధిత కుటుంబం వద్దకు వెళ్లారు. భార్య, భర్త పిల్లలిద్దర్నీ వారు ఎస్పీ ఆఫీస్ కి తీసుకొచ్చారు. ఇక అక్కడ ఎస్పీ కౌన్సెలింగ్ మొదలుపెట్టారు. భర్తకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో అతను తప్పు తెలుసుకున్నారు. భార్యను దగ్గరకు తీసుకున్నాడు, పిల్లలిద్దర్నీ హత్తుకున్నాడు. పోలీసులకు ధన్యవాదాలు తెలిపి కుటుంబంతో సహా సంతోషంగా వెళ్లిపోయాడు. 


జిల్లా పోలీసులకు అభినందనల వెల్లువ.. 
విడిపోవాల్సిన ఓ కుటుంబం నెల్లూరు పోలీసుల వల్ల కలిసిపోయింది. ఎస్పీ వెంటనే స్పందించడం, ఆ వెంటనే దిశ పోలీసుల టైమింగి రియాక్షన్ వల్ల ఆ కుటుంబం కలిసిపోయింది. భార్యా భర్తల వివరాలు మాత్రం పోలీసులు మీడియాకు వెెళ్లడించలేదు. అయితే ఆ కుటుంబం మాత్రం సంతోషంగా ఇంటికెళ్లిపోయిందని చెబుతున్నారు పోలీసులు. కోర్టు వరకు వెళ్లాల్సిన వ్యవహారాన్ని పోలీసులు కౌన్సెలింగ్ ద్వారా సుఖాంతం చేశారు. 




కొవిడ్ కారణంగా కొన్ని రోజులు వాయిదా పడిన స్పందన కార్యక్రమంల నెల్లూరు జిల్లాలో తిరిగి ప్రారంభమైంది. జిల్లాలోని అన్ని ప్రధాన కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం మొదలైంది. బాధితులు కూడా పెద్దఎత్తున కార్యాలయాలకు వచ్చారు.


Also Read: TTD Sarvadarshan Tokens: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్, ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీ చేసిన టీటీడీ


Also Read: Chittoor Crime: పేరెంట్స్‌తో కలిసి యువతులను ట్రాప్ చేస్తున్న నిత్య పెళ్లికొడుకు, మొదటి భార్య నిఘా పెట్టడంతో షాకింగ్ ట్విస్ట్ !