TTD Sarva Darshan Tokens: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. కరోనా వ్యాప్తితో చిత్తూరు జిల్లా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపి వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేటి నుంచి పునః ప్రారంభించింది. ఈ తెల్లవారు జామున 5 గంటల నుంచి సర్వ దర్శనం టోకెన్లను ఆఫ్లైన్ ద్వారా భక్తులకు జారీ చేసింది. రోజుకు పది వేల టికెట్ల చోప్పున తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ స్వామి సత్రాల్లో ఉచిత దర్శనం టికెట్లను జారీ చేస్తుంది టీటీడీ.
కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వరుడి దర్శనార్ధం దేశ విదేశాల నుండి భక్తులు తిరుమలకు చేరుకుంటారు. కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామి వారి దర్శనంకు టీటీడీ అనుమతిస్తూ వస్తుంది. ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను జారీ చేస్తూ వచ్చేది టీటీడీ. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు దర్శన టోకెన్ల అందక ఇబ్బందులు వచ్చేవి. దీంతో భక్తులు టీటీడీకి లేఖలు, ఫోన్ ద్వారా తమ సమస్యలు విన్నవించడంతో వైద్య నిపుణుల సూచనలు, సలహాలు మేరకు కోవిడ్ పరిస్ధితులు అనుకూలించడంతో ఆఫ్లైన్ లోసర్వదర్శన టోకెన్లు జారీ (TTD issue offline free Darshan Tickets) చేస్తుంది
సామాన్య భక్తులు చాలా వరకూ సర్వదర్శనం టోకెన్లపై ఆధారపడి దాదాపు రెండు ఏళ్ళు పాటు శ్రీవారి దర్శనభాగ్యంకు దూరం అయిన వారు ఉండడంతో భక్తుల సౌకర్యార్ధం ఆఫ్లైన్ లో టోకెన్లు జారీని నేటి నుండి ప్రారంభించింది. కరోనా మొదటి దశ తరువాత కోవిడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని పూర్తిగా నిలిపి వేసింది టీటీడీ. కోవిడ్ నుండి కొంత ఉపశమనం రావడంతో మొదటి దశ తరువాత భూదేవి కాంప్లెక్స్ లో రోజుకి ఎమినిది వేల టికెట్లను జారీ చేస్తూ వచ్చింది. ఆ సమయంలో వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తిరుపతికి తరలి వచ్చారు.
కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో భక్తుల ఆరోగ్య భధ్రత దృష్ట్యా సర్వదర్శన టోకెన్లను నిలిపి వేశారు. అప్పటి నుండి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు, సిఫార్సు లేఖలు ద్వారా భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తూ వస్తొంది టీటీడీ. ఈ క్రమంలో రోజు ముప్పై ఐదు వేల మంది మాత్రమే స్వామి వారిని దర్శించుకునే వారు. అయితే గత నాలుగు నెలల క్రితం సర్వదర్శనంను తిరిగి టిటిడి ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకుంది. రోజుకు పది వేల చోప్పున ఆన్లైన్ ద్వారా సామాన్య భక్తుల కోసం టిక్కెట్లను జారీ చేస్తోంది.
గ్రామీణ ప్రాంతాల భక్తులను టోకెన్లు అందక పోవడంతో తిరుపతిలో నేరుగా రోజుకి పది వేల చోప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్లైన్ ద్వారా జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.. ఈ క్రమంలోనే ఇవాళ వేకువజామున నుండి తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ స్వామి సత్రాల్లో టోకెన్లు జారీ చేస్తుంది టిటిడి..ఆఫ్లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం సామాన్య భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Lord Hanuman: ఆ ఊర్లో ఆంజనేయుడి పేరెత్తారో అయిపోతారంతే
Also Read: Pawan Kalyan: ఎరను ఆహారం అనుకుని ఆశపడుతున్నారు పవన్ సెటైరికల్ ట్వీట్, వాళ్లను ఉద్దేశించేనా?