ఆంజనేయస్వామి తిరుమలలోని అంజనాద్రిలో పుట్టలేదని హనుమన్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్(Hanuman Janmabhoomi Tirtha Kshetra Trust) గోవిందానంద సరస్వతి ఆరోపించారు. సోమవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రం కిష్కింధ(Kishkinda)లోని పంపా నదిక్షేత్రంలోనే పుట్టారని స్పష్టం చేశారు. టీటీడీ దైవద్రోహం చేస్తోందని, హనుమంతుని జన్మస్థలం పేరుతో నకలీ పుస్తకాన్ని టీటీడీ ముద్రిస్తోందన్నారు. టీటీడీ పాలక మండలి(TTD Board) నాటకం ఆడుతోందని, సన్యాసులను, ప్రజలను టీటీడీ మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. అంజనాద్రి పేరుతో తిరుమల(Tirumala)లో షాపులు నిర్మించి డబ్బులను సంపాదించాలని పాలక మండలి ప్రయత్నిస్తోందన్నారు. శారదాపీఠం దొంగ పీఠమని ఆరోపించారు. సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగించే వారెవరినీ వదిలి పెట్టమన్నారు.



హనుమన్ జన్మ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రథయాత్రను చేపట్టామని, 12 సంవత్సరాల పాటు రథం దేశ వ్యాప్తంగా తిరుగుతుందని గోవిందానంద సరస్వతి వెల్లడించారు. కిష్కింధ హనుమంతుని జన్మ స్థలమని ప్రజలకు తెలియజేస్తామన్నారు. రూ.1200 కోట్లతో కిష్కంధను అభివృద్ధి చేస్తామని ప్రకటించారన్నారు. టీటీడీ(TTD)ని తాను డబ్బులు డిమాండ్ చేశానని ఆరోపణలు చేస్తున్నారని, రూ.100 కోట్లు డబ్బులు డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే గుండు కొట్టుకుని తిరుగుతానన్నారు. గోవిందా నంద సరస్వతి ప్రెస్ మీట్ లో కాసేపు గందరగోళం నెలకొంది. రాముల వారి గుడి వీధిలో రోడ్డుపై ఉంచిన రథాన్ని పక్కకు పోలీసులు తొలగించారు. 


Also Read: ప్రజలంతా నాకు థాంక్స్‌ చెప్పాలి - హోదా అజెండా నుంచి తొలగించేలా చేసింది తానేనన్న జీవీఎల్ !


'పార్లమెంట్ లో కూడా టీటీడీ కమిటీని నిరాకరించారు. శృంగేరీ, బదరీ పీఠాలు, ఇతర ప్రముఖ పీఠాలు కూడా హనుమంతుడు కిష్కింధలో పుట్టారని నిర్థారించారు. ఈ నెల 16న జరిగే అంతా బోగస్. రూ.1200 కోట్లతో కిష్కంధలోని హనుమంతుని జన్మస్థలంలో ఆలయాన్ని నిర్మిస్తామన్నారు. ఈ నగదు దేశవ్యాప్తంగా రథయాత్ర(Rath Yatra) చేసి విరాళాలు సేకరిస్తాం. ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి, కర్ణాటక ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని తెలియజేశాం. ఇన్ కమ్ ట్యాక్స్(Income Tax) అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజుతో హనుమంతుడు అంజనాద్రిలో పుట్టారని తప్పని తెలిపోయింది. కర్ణాటక ప్రభుత్వం ఆ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.' అని  గోవిందా సరస్వతి తెలిపారు. అయితే హనుమంతుని జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి అని టీటీడీ ప్రకటించింది. అక్కడ హనుమంతుని క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. 


Also Read: ఆంజనేయుడు ఏడుకొండల్లోనే జన్మించాడు, ఆధారాలివిగో