Nellore News : నెల్లూరు జిల్లాలో దశాబాద్ధాల చరిత్ర గలిగిన తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో అపచారం జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆలయ గోపురంపై శంకుచక్రాలకు వైఎస్ఆర్‌సీపీ  రంగులు పులమడం వివాదస్పదంగా మారింది. ఆలయం ఎదుట టీడీపీ  శ్రేణులు భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ జెండా రంగుల్ని పోలి ఉన్న రంగులను శంఖు, చక్రాలకు ఎందుకేశారంటూ నిలదీస్తున్నారు. ఆఖరికి ఆలయాలకు కూడా ఆ రంగులేస్తారా అంటూ మండిపడ్డారు. 


సీఎం జగన్‌ నుంచి ప్రాణహానీ - ఎంపీలు అందరికీ లేఖలు రాసిన రఘురామ !


దేవుళ్లతో కూడా రాజకీయాలు చేయాలా అంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ నాయకులు. వారంతా ఆందోళనకు దిగడంతో ఆలయ అధికారులు స్పందించారు. అయితే అవి వైఎస్ఆర్‌సీపీ రంగులు కాదని ఆలయ వర్గ్లు చెబుతున్నాయి. అవి ఇంద్రధనస్సు రంగులు వేశామని మూడు రోజుల్లో పరిష్కరిస్తామని ఆలయ ఛైర్మన్ ఇలపాక శివచారి ప్రకటించారు.   అయితే హిందూ సంఘాలు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. 


అసలు నిఘా పెట్టింది ప్రస్తుత ప్రభుత్వమే - ఆడిట్‌కు సిద్ధమా అని పయ్యావుల సవాల్ !
 
ప్రసిద్ధి చెందిన రంగనాధ స్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటి.  12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలిచేవారు.   17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్తులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది.ఈ గాలి గోపురంపై భాగాన బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి. ఇలాంటి పురాతన ఆలయానకికి వైఎస్ఆర్‌సీపీ పార్టీ రంగులను వేయడం వివాదాస్పదం అవుతోంది. 


చంద్రబాబు వేలికి ఉంగరంపై చర్చోపచర్చలు - అసలు విషయం ఇదా ?


ఏపీలో కొన్నాళ్లుగా రంగుల రాజకీయం నడుస్తోంది. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రంగులు పూశారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ పూయడంతో వివాదాస్పదం అయింది. కోర్టులు కూడా రంగుల్ని తొలగించాలని ఆదేశించాయి. అప్పుడప్పుడు ఆలయాలకూ రంగులేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి వివాదమే ఏర్పడటంతో తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.  అయితే ఆ రంగులు వైఎస్ఆర్‌సీపీ రంగులు పోలి లేవని .. టీడీపీ నేతలు అనవసరంగా వివాదం చేస్తున్నారని ఆలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి