Chandrababu Ring :   తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు నమ్మకాలు, సెంటిమెంట్లు దాదాపుగా ఉండవు. ఆయన చేతికి ఉంగరాలు, వాచీలు కూడా పెట్టుకోరు. అయితే మదనపల్లె మహానాడు కోసం ఆయన రాజంపేట జిల్లాలో పర్యటించిన సమయంలో ఆయన చూపుడు వేలికి ఓ ఉంగం లాంటి  వస్తువు ఉంది. దీంతో కొన్ని మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియాలోనూ విస్తృత చర్చ జరిగింది. ఆ ఉంగరం ఖచ్చితంగా జాతకాలు చూసి ఎంపిక చేసుకున్నదేనని కొంత మంది తేల్చారు. మరికొంత మంది అది  మహార్జాతకం కోసం ఎంపిక చేసుకున్న ఉంగరం అని.. అందుకే ఆ వేలికి పెట్టుకున్నారని విశ్లేషించారు.


35 ఏళ్ల నాటి విషయాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు, మళ్లీ నల్లారి ఇంటికి!


మదనపల్లె మినీ మహానాడులో చంద్రబాబు ఏం మాట్లాడారన్నదాని కన్నా ఆయన పెట్టుకున్న ఉంగరంపైనే చర్చ 


ఈ ఉంగరం టాపిక్ సోషల్ మీడియాలో హైలెట్ అయింది.  మదనపల్లె మినీ మహానాడులో చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పెద్ద ఎత్తున జనసమీకరణ జరిగింది. అయితే వాటి గురించి పట్టించుకోని కొంత మంది చంద్రబాబు వేలికి ఉన్న ఉంగరం గురించి మాత్రం విస్తృతంగా చర్చ పెట్టారు. 


మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?


అది ఫిట్ నెస్ ట్రాకర్ అని స్వయంగా చంద్రబాబు చెప్పినా సరే !


నిజానికి అది ఉంగరం కాదు. హెల్త్ మానిటర్. ఫిట్‌నెట్ ట్రెండ్స్ గురించి ఆసక్తి ఉన్న ఎవరికైనా వేలికి పెట్టుకునే ఫిట్నెస్ మానిటర్స్ గురించి తెలుసు. చాలా మందికి వాచీలా చేతికి పెట్టుకుననే హెల్త్ మానిటర్స్ మెయిన్‌టెయిన్ చేస్తూంటారు. ఇప్పుడు లెటెస్ట్ టెక్నాలజీతో వేలికి పెట్టుకునే ఉంగరాల్లంటి పరికరాలు వచ్చేశాయి. అలాంటి ఫిట్‌నెస్ ట్రాకరే చంద్రబాబు పెట్టుకున్న ఉంగరం. ఈ అంశంపై మీడియా సమావేశంలో.. వివిధ వార్తా సంస్థల ప్రతినిధులు అడిగినప్పుడు చంద్రబాబు కూడా చెప్పారు. అయినా కొన్ని సంస్థలు అది సెంటిమెంట్ అంటూ ప్రచారం చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.




రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్‌లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!


ఫిట్‌నెస్, ఆరోగ్యం విషయంలో చంద్రబాబు మిస్టర్ పర్ ఫెక్ట్ 


చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా ఉంటారు. తినే ఆహారంతో పాటు ప్రతి అంశంలోనూ ఖచ్చితంగా ఉంటారు. అలాగే ఫిట్‌నెస్ విషయంలోనూ జాగ్రత్తగా ఉంటారు. పార్టీ కార్యక్రమాలపై బయటకు వెళ్లినప్పుడు ఫిట్‌నెస్ ట్రాకర్లను ఉపయోగిస్తూ ఉంటారు.