నెల్లూరులో రోడ్లపై చేపలు పట్టుకోవచ్చు. మీరు విన్నది నిజమే. రోడ్లపై చేపలేంటి అని ఆశ్చర్యపోకండి. ఇటీవల భారీ వర్షాలకు నెల్లూరు స్వర్ణాల చెరువు ప్రవాహం పెరిగింది. నీరు ప్రవాహం పెరిగిన రోడ్లపైకి వచ్చింది. దీంతో చెరువులోని చేపలు రోడ్లపైకి రావడంతో అటు వెళ్లే వాహనదారులు, స్థానికులు  చేపల వేటలో పడ్డారు. 


Also Read: రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !


నెల్లూరు స్వర్ణాల చెరువు కలుజు ప్రవాహంలో..
 
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో పొట్టేపాలం వద్ద ఈ పరిస్థితి ఉంది. నెల్లూరుకి నీరందించే స్వర్ణాల చెరువు కలుజు ప్రవాహం అక్కడ మొదలవుతుంది. చెరువు కలుజులోనుంచి పారుతున్న నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తూ పెన్నా నదిలో కలుస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని స్థానికులు పట్టుబడుతున్నా.. అధికారులు చప్టాతో సరిపెడుతున్నారు. గతంలో కనీసం రోడ్డు కిందుగా నీరు వెళ్లే అవకాశం ఉండేది. ఇప్పుడు చప్టా స్థానంలో రోడ్డు వేయడంతో.. నేరుగా రోడ్డుపై నుంచే ప్రవాహం వెళ్తోంది. వర్షాలు పడినప్పుడు ప్రవాహం పెరిగి రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తుంది. దీంతో అటుగా వాహనాలు వెళ్లడం కష్టంగా మారుతుంది. 


Also Read: ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ఒత్తిడి లేదు... గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు... ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు


నెల్లూరు చేపలు సూపర్ టేస్ట్


స్వర్ణాల చెరువులో స్థానికులు చేపలు పడుతుంటారు. కానీ భారీ వర్షాలకు చెరువులో నుంచి భారీగా నీరు బయటికొస్తోంది. దీంతో పెద్ద పెద్ద చేపలు ఆ నీటితోపాటు బయటికొచ్చేస్తున్నాయి. గేలం వేసి వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఒకరిని చూసి ఒకరు చేపలు పట్టేందుకు ఎగబడ్డారు. దీంతో రోడ్డుపైనే చేపలు పడుతూ ట్రాఫిక్ కి అడ్డంగా నిలబడిపోతున్నారు. నెల్లూరు చెరువు చేపలు మంచి రుచిగా ఉంటాయి. అందులోనూ వాన నీటికి కొట్టుకొచ్చే చేపలు, సులభంగా దొరుకుతుండటంతో రోడ్డున పోయేవారు కూడా ఆగి చేపల కోసం వేట సాగిస్తున్నారు. దీంతో నెల్లూరు పొట్టేపాలెం కలుజు ప్రాంతం జాతరలాగా మారింది. చేపలు పట్టుకునేందుకు వాహన దారులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో చేరడంతో అక్కడంతా కోలాహలంగా మారింది. 


Also Read: రేపు తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్... ఇవాళ తిరుపతికి అమిత్ షా, జగన్... కేసీఆర్ డుమ్మా...!


Also Read: పీఆర్సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావడం లేదు.. అమలు చేస్తారా? లేదా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి