29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి తిరుపతి వేదికకానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరుకానున్నారు. రేపు(ఆదివారం) జరిగే సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్ లు, ముఖ్య అధికారులు హాజరుకానున్నారు.
ఇవాళ తిరుపతికి అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఏపీకి రానున్నారు. రేపు తిరుపతిలో జరిగే సదరన్ జోనల్ సమావేశంలో రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాలు, సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి, పెండింగ్ అంశాలు, ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనే రాష్టాలకు సంబంధించిన 48 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం మరింత పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి సూచనలు చేయనున్నారు.
Also Read: రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !
సీఎం జగన్ పర్యటన ఖరారు
సీఎం జగన్ తిరుపతి పర్యటన ఖరారైంది. శనివారం తిరుపతి వెళ్లనున్న సీఎం.. తిరిగి రాత్రి 1 గంటకు తాడేపల్లికి చేరుకుంటారు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం తిరుపతి బయల్దేరి వెళ్తారు. ఆజివారం జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. శనివారం సాయంత్రం 6.15కు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ స్వాగతం పలుకుతారు. అనంతరం అమిత్ షాతో తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. శనివారం రాత్రి 11.30కి తిరుపతి నుంచి బయలు దేరి రాత్రి 1 గంటకు తాడేపల్లికి చేరుకుంటారు. మళ్లీ తిరిగి ఆదివారం మధ్యాహ్నం 1.15కు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి తిరుపతి వెళ్తారు. తిరుపతి తాజ్ హోటల్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.
కేసీఆర్ డుమ్మా..!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కావడంలేదని సమాచారం. ఆయనకు బదులుగా హోంమంత్రి మహమూద్ ఆలీ, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రెండేళ్ల తర్వాత జరగనున్న ఈ సమావేశానికి సీఎం హాజరయ్యే అవకాశం ఉందని గత వారం సచివాలయ వర్గాలకు సమాచారం వచ్చింది. కానీ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో ఈ సమావేశానికి కేసీఆర్ హాజరవ్వరనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ధాన్యం కొలుగోలుకు కేంద్రం నిరాకరిస్తుందని టీఆర్ఎస్ పార్టీ నిరసనలు కూడా చేశారు.
Also Read: యాసంగి వడ్లు కొంటరా ? కొనరా? తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ధర్నాలు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి