భారతీయ జనతా పార్టీపై టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. యాసంగి సాగులో వరి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రం స్పష్టమైన వైఖరి చెప్పాలని, ఇకనైనా కేంద్రం మౌనం వీడనాడాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నాలు నిర్వహిస్తోంది. రైతుల వద్ద కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ మినహా అందరూ ధర్నాల్లో పాల్గొంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు కూడా తమ తమ నియోజకవర్గాల్లో నిరసన చేపట్టారు.


Also Read : ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు.. కొద్ది రోజుల్లో నల్గొండలో అదే జరుగుతుందట!


సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు ధర్నా నిర్వహించారు. ధర్నాల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున అధికార టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు భారీగా తరలివచ్చారు. "యాసంగి వడ్లు కొంటరా..?  కొనరా ?" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫ్లకార్డులతో నాయకులు నిరసన తెలిపారు. కేంద్రం వరి కొనుగోలుపై స్పష్టమైన వైఖరి చెప్పేవరకూ తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు.


Also Read : జల వివాదాల పరిష్కారానికి ఆలస్యం తెలంగాణదే కేంద్రానికి కాదు ! కేసీఆర్‌దంతా డ్రామాగా తేల్చిన షెకావత్ !


తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు బీజేపీకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. యాసంగి వడ్లు కొనే వరకూ ఉద్యమం నిర్వహిస్తామని చెబుతున్నారు. కేంద్రం యాసంగిలో వడ్లు కొనబోమని చెప్పిందని అందుకే వరి పంట వేయవద్దని తెలంగాణ ప్రభుత్వం రైతుల్ని కోరుతోంది. అయితే బీజేపీ మాత్రం కేంద్రం అలా చెప్పలేదని టీఆర్ఎస్ రైతుల్ని మోసం చేస్తోందని మండిపడుతున్నారు. కేసీఆర్ వరుసగా రెండు రోజుల పాటు ప్రెస్‌మీట్ పెట్టి ఈ అంశంపై బీజేపీపై విరుచుకుపడ్డారు. నిరసనలకు పిలుపునిచ్చారు.


Also Read : తిరిగిచ్చేద్దాం అన్న కేటీఆర్.. ఇలాంటోళ్లు ఉండాలన్న మహేశ్... ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్


త్వరలో ఢిల్లీలోనూ ధర్నా చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ధర్నాలకు పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ధర్నాలు చేసి.. బీజేపీపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. 


Also Read : హుజురాబాద్‌ ఫలితంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. 13న టీ పీసీసీ నేతలతో ఢిల్లీలో సమీక్ష !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి