RGV Ladki Posters :  రామ్ గోపాల్ వర్మ  తాజా సినిమా "అమ్మాయి" పోస్టర్లు అసభ్యంగా ఉన్నాయని ఓ జిల్లా కలెక్టర్ దగ్గరుండి మొత్తం సిబ్బందిని పిలిపించి పీకేయించిన ఘటన ఏపీలో జరిగింది. రామ్ గోపాల్ వర్మ కొత్తగా అమ్మాయిలు.. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ అంటూ కొత్త సినిమా తీశారు. అయితే ఆ సినిమా మార్షల్ ఆర్ట్స్‌లా కాకుండా ఆ పేరుతో ఆ ఫైటింగ్‌లు చేస్తున్న హీరోయిన్ అందాల్ని ప్రదర్శించడానికన్నట్లుగా షూట్ చేశారు. దానికి తగ్గట్లుగా పోస్టర్లు, ట్రైలర్లు రిలీజ్ చేశారు.


ఏ రాష్ట్రంలోనూ ఇన్ని పథకాలు లేవు, బటన్ నొక్కి రూ.1.65 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం- సీఎం జగన్


సినిమా కూడా విడుదలయింది. ఈ సందర్భంగా నర్సరావుపేటలో పోస్టర్లు వేశారు. అయితే విడుదలపై కొంత మంది స్టే తీసుకు వచ్చారని రామ్ గోపాల్ వర్శ స్టేషన్‌కు వెళ్లి కేసులు పెట్టడం లాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో సినిమాను ప్రదర్శిస్తున్నారో లేదో స్పష్టత లేదు. కానీ పోస్టర్లు మాత్రం వేశారు.  అలాగే నర్సరావుపేటలోనూ వేశారు. ఇటీవల జిల్లా కేంద్రం అయిన నర్సరావుపేటలోనే కలెక్టర్ వంటి ఉన్నతాధికారులు ఉంటున్నారు.


బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టేసిన గౌతమ్‌ అదానీ - ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానానికి ఇండియన్‌


విధఉల్లో భారంగా నర్సరావుపేట రోడ్ల గుండా వెళ్తున్న కలెక్టర్‌కు లడ్కీ పోస్టర్లు కనిపించాయి. మరీ ఇంత అసహ్యంగా ఉన్నాయని... వాటిని రోడ్లపై ఎలా ఉంచుతారని ఆయన ఫీలయ్యారు. వెంటనే..  అధికారుల్ని పిలిపించారు. నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్‌తో పాటు సిబ్బందిని పిలిపించి.. ఎక్కడ లడ్కీ పోస్టర్లు కనిపిస్తే అక్కడ చించేయించారు.  అశ్లీల పోస్టర్లు విషయమై త్వరలోనే జిల్లాలోని సినిమా హాలుల యజమానులతో సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


వరదలొచ్చాయిగా, పోలవరం ఆలస్యమవుతుందేమో-పార్లమెంట్‌లో కేంద్రమంత్రి వ్యాఖ్యలు


అయితే కలెక్టర్ స్థాయి అధికారి నుంచి ఇలాంటి స్పందన వస్తే రామ్ గోపాల్ వర్మఏ మాత్రం ఫీల్ కారు కానీ.. గొప్ప చాన్స్ మిస్సయిందని అనుకునే అవకాశం ఉందనే సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే వివాదాలతో వచ్చే పబ్లిసిటీ ఎంత పవర్ ఫుల్లో ఆయనకు తెలుసు.  సినిమా విడుదలకు ముందు ఇలా కలెక్టర్ చించేసి ఉంటే ఆర్జీవీ టీవీ స్టూడియోల్లో కూర్చుని డిస్కషన్స్ పెట్టుకుని అర్జున్ రెడ్డి తరహాలో పబ్లిసిటీ తెచ్చుకునేవారేమో కానీ.. ఇప్పటికే సినిమా రిలీజైపోయింది.