వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేతలను పంపించడం కాదని నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే రావాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలకు కౌంటర్‌గా ఆయన ప్రెస్‌మీట్ పెట్టారు. పార్టీ ఆఫీసుపై దాడి చేయించి జగన్ నిజంగానే సైకో రెడ్డి అనిపించుకున్నారని విమర్శించారు. పెంపుడు కుక్కలను తమపైకి పంపి తాడేపల్లి ఇంటిలో దాక్కున్న వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. నేరుగా వస్తే మాట్లాడదామని, పోరాడదామని లోకేశ్ సవాల్ విసిరారు. ఎవరూ లేని సమయంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే భయపడబోమన్నారు. నాలుగు అద్దాలు పగిలితే భయపడతామని భావిస్తున్నారా? దాడులు చేసినంత మాత్రాన మేం భయపడం. రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయని హెచ్చరించారు.
Also Read : అంతా చంద్రబాబే చేశారు.. వైసీపీ మంత్రులు, నేతల ఘాటు విమర్శలు!
అధికార పార్టీగా ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలని లేకపోతే ఇంటికే పరిమితం కావాలన్నారు. ఏపీలో గంజాయి, డ్రగ్స్ మాఫియా పెరిగిపోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలకు .. ఏపీ నుంచి వెళ్లిన గంజాయి, అక్కడి పోలీసుల ప్రకటనలను లోకేష్ ప్రదర్శించారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా రాష్ట్రానికి సంబంధాలు ఉన్నాయ్నారు. ఏపీ నుంచి ఎక్కువగా గంజాయి వస్తుందని హైదరాబాద్ సీపీ చెప్పారని వీడియో ప్లే చేసి చూపించారు. డ్రగ్స్‌పై పక్క రాష్ట్రం సీఎం స్పందించారు. కానీ, ఇక్కడి సీఎం స్పందించలేదన్నారు.
Also Read : చేతకాని దద్దమ్మలే తిడతారు.. తిడితే ఇక ముందు అదే రియాక్షన్ వస్తుందని సజ్జల హెచ్చరిక !
దాడికి పాల్పడిన దుండగులు డీజీపీ కార్యాలయం మీదుగానే వచ్చారు. దాడి తర్వాత అటు వైపే వెళ్లారు. మఫ్టీలో ఉన్న పోలీసులను పంపించి దాడులు చేయించారని లోకేష్ మండిపడ్డారు. ప్రతిపక్షనేతగా తాను ఎలాంటి బూతులు మాట్లాడలేదన్న జగన్ వ్యాఖ్యలు, వైసీపీ నేతల మంత్రుల తిట్లను లోకేష్ ప్రదర్శించారు. సీఎంగా ఉన్న చంద్రబాబును నడివీధిలో కాల్చి చంపాలని పిలుపునిచ్చారన్నారు. బూతులకు కేరాఫ్ అడ్రస్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ యూనివర్సిటీనేనన్నారు. తమ అధినేత ఉన్న సహనం తమకు లేదని.. రెండు చెంపలు వాయిస్తామన్నారు.
Also Read : " ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు " - 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష !
టీడీపీ ఆఫీసు, పట్టాభి ఇంటిపై దాడి చేసి ఇరవై నాలుగు గంటలైనా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించాలని డిమాండ్ చేశారు. కొందరు పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. వారందరికీ తగిన సమాధానం చెబుతామన్నారు.
Also Read : బూతులు వినలేక .. అభిమానించే వాళ్లకు బీపీ వచ్చి రియాక్టయ్యారు : జగన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి