ఇప్పుడు ఎక్కడ చూసినా.. అఖండ సినిమా గురించే చర్చ. బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. హిట్ టాక్ తెచ్చుకుంటూ.. సినిమా దూసుకెళ్తోంది. ఆయన అభిమానులు.. జోరు మీద ఉన్నారు. అయితే ఇలా నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్న ఇలాంటి టైమ్ లో ఓ ఫ్యాన్ హఠాన్మరణం చెందాడు. దీంతో అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ‘అఖండ’ సినిమా చూస్తూనే అతను మరణించడం అందరిలోనూ విషాదాన్ని నింపేసింది. 


బాల‌య్యకు వీరాభిమాని, ఈస్ట్ గోదావ‌రి జిల్లా ఎగ్జిబిట‌ర్స్ అసోసియేష‌న్ అధ్యక్షుడు జాస్తి రామ‌కృష్ణ.. రాజమండ్రి శ్యామల థియేటర్ లో అఖండ సినిమా చూస్తున్నారు. అలా చూస్తూ.. చూస్తూ.. అక‌స్మాత్తుగా అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లారు. విషయం తెలిసిన థియేటర్ యాజమాన్యం..  రామకృష్ణను వెంట‌నే ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సినిమా చూస్తున్న టైమ్ లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని  ఆయన సన్నిహితులు అంటున్నారు. 


రాజమండ్రి సమీపంలోని నామవరం వీఎస్ మహల్ థియేటర్ దగ్గర నుంచి  రామకృష్ణ కెరీర్ ప్రారంభమైంది. కష్టాలు ఎదుర్కొంటూ.. ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్నారు. ఆయన మృతిపై ఇత‌ర ఎగ్జిబిట‌ర్లు సంతాపం వ్యక్తం చేశారు.


అఖండ సినిమాకు అఘోరాలు
బాలయ్య అఖండ సినిమాకి అఘోరాలు వచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నం బంగార్రాజు థియేటర్ కు వచ్చారు అఘోరలు. అఖండ సినిమాకు అఘోరాలు కూడా ఫ్యాన్స్ అయ్యారు అంటూ అభిమానులు థియేటర్లో  కేకలు వేశారు. కాసేపు బాలయ్య అభిమానులతో మాట్లాడి.. శివ నామం పలుకుతూ బయటకి వెళ్లారు అఘోరాలు. 


Also Read: Nitin Mehta: ఇండియన్ ఆర్మీను వదులుకొని.. 'అఖండ'లో విలన్ గా.. 


Also Read: Actress Poorna: రాయల్ లుక్ లో 'అఖండ' బ్యూటీ.. ఫొటోలు వైరల్..


Also Read: Unstoppable: బాలయ్య షోలో మహేష్ బాబు.. ఫ్యాన్స్ వెయిటింగ్.. 


Also Read: Akhanda First Day Collections: ‘అఖండ’ కలెక్షన్లు.. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల సునామీ.. కానీ, ఏపీలోనే..


Also Read: Akhanda: ఆ దరువులకు బొమ్మ దద్దరిల్లింది.. ఫైట్లకు మైండ్ బ్లాకయింది..


Also Read: Akhanda & Jr NTR : కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!


Also Read: థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఆ విషయంలో కేంద్రం మీనమేషాలు: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి


Also Read: వైఎస్‌ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి