నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా థియేటర్లలో చేస్తోన్న సందడి మాములుగా లేదు. ఎంట్రీ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు.. ఏ ఒక్క షాట్ ని కూడా మిస్ చేయలేం. అన్ని ఏరియాల నుంచి సినిమాకి మంచి టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయి. 'అఖండ' సినిమాతో ఇండస్ట్రీకి ఊపొచ్చింది. ఒక మాస్ సినిమా వస్తే.. థియేటర్ వద్ద పూనకాలు ఎలా ఉంటాయో 'అఖండ' సినిమా నిరూపించింది. సినిమాలో సన్నివేశాలు, వాటికి బోయపాటి ఇచ్చిన ఎలివేషన్ గురించి ఎంత చెప్పుకున్నా.. తక్కువే. 
ఈ సినిమా కోసం దర్శకుడిగా బోయపాటి ఎంత కష్టపడ్డాడో ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఇక బోయపాటి కథను తన మ్యూజిక్ తో తమన్, యాక్షన్ ఎపిసోడ్స్ తో రామ్-లక్ష్మణ్ సినిమా స్థాయిని మరింత పెంచేశారు. 


ముందుగా తమన్ గురించి మాట్లాడుకోవాలి. 'అఖండ' సినిమాకి తమన్ మ్యూజిక్ అన్నప్పుడే బాక్సులు బద్దలవ్వడం ఖాయమనుకున్నారు. ఆ అంచనాలకు ఎంతమాత్రం తగ్గలేదు తమన్. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్.. సెకండ్ హాఫ్ లో అఘోరా పాత్రకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్. బోయపాటి సినిమాలో ఎలివేషన్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆయన అడుగుకొక ఎలివేషన్ పెడితే.. తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాస్ జాతరగా మార్చేశాడు. శివుడి సాంగ్, శ్లోకాలు తమన్ మ్యూజిక్ తో మరింత ఎలివేట్ అయ్యాయి. 


ఇక ఈ సినిమా హిట్ అవ్వడానికి మరో మెయిన్ రీజన్.. యాక్షన్ సీన్స్ అనే చెప్పాలి. సినిమాలో ఒక్కో ఫైట్ సీన్ ను ఒక్కో విధంగా డిజైన్ చేశారు రామ్-లక్ష్మణ్. కథ మొదలవ్వగానే ఎంట్రీ సీన్ ఫైట్ కి థియేటర్లో మొదలయ్యే రచ్చ క్లైమాక్స్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మొదటి ఫైట్ లో పంచె కట్టుకొని బాలయ్య ఫైట్ చేసే విధానం ఫ్యాన్స్ కి మంచి కిక్కిస్తుంది. మధ్యలో ఎద్దులను వాడుకోవడం కూడా బాగా ఎలివేట్ అయింది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫైట్ మాములుగా ఉందనిపించినా.. సెకండ్ హాఫ్ లో మాత్రం ఫైట్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. అఘోరా గెటప్ లో బాలయ్య త్రిశూలం పట్టుకొని చేసే ఫైట్స్ అంచనాలకు మించి ఉంటాయి. అభిమానులు బాలయ్యని ఎలా చూడాలనుకుంటున్నారో.. దానికి ఏమాత్రం తగ్గకుండా యాక్షన్ సీన్ ను డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ లో దాదాపు మొత్తం యాక్షన్ సీన్సే.. గ్రావిటీ, లాజిక్స్ ను పక్కన పెట్టేస్తే బాలయ్య ఫైట్స్ కి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. 


Also Read:సూపర్ స్టార్ మోకాలికి సర్జరీ.. రెండు నెలలు ఇంట్లోనే..


Also Read: కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!


Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!


Also Read: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...


Also Read: సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి