ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్పందన కార్యక్రమానికి ప్రతిస్పందనలు ఉండటం లేదని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు . పలు అంశాలపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పించారు. ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు ప్రారంభించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు ఇస్తున్నా ఎలాంటి పరిష్కారం కనిపించడం లేదని ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.  విశాఖ పోలీస్ కమిషనర్ మూడు నెలలుగా అక్కడ స్పందన కార్యక్రమనే నిర్వహించడం లేదన్న వార్తలు వస్తున్నాయన్నారు. అక్కడ  ముఖ్యమంత్రి తరపున బాధ్యతలు తీసుకుని పని చేస్తున్న విజయసాయిరెడ్డి పక్క రాష్ట్రాల గురించి ఆలోచించడం మానేసి ఏపీ గురించి ఆలోచించాలన్నారు. విజయసాయిరెడ్డి చైర్మన్‌గా ఉన్న స్టాండింగ్ కమిటీ తరపున ఏపీతో పాటు జార్ఖండ్, చత్తీస్‌ఘడ్‌లకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసింది. దీని గురించి రఘురామ కృష్ణరాజు సెటైర్లు వేశారు. విశాఖలో ప్రజలకు ఎన్నో సమస్యలున్నా స్పందించేవారు లేరన్నారు. Also Read : టీడీపీ వర్సెస్ టీడీపీ


స్పందనలో ఫిర్యాదులు ఇస్తున్న వారిపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో రక్షకులు భక్షకులు అవుతున్నారని కడప జిల్లాలో భాషాను పరామర్శించడానికి వెళ్లిన మైనార్టీ హక్కుల సంస్థకు చెందిన నేతపై హత్య కేసు పెట్టాడాన్ని ప్రస్తావించి విమర్శించారు. శిక్ష పడే వరకూ ఎవరూ నేరస్తుడు కాదన్నారు. జగన్మోహన్ రెడ్డిపై  ముఫ్పై, నలభై కేసులు ఉన్నాయి కానీ శిక్షపడలేదు కాబట్టి నేరస్తుడు కాదని వ్యాఖ్యానించారు. సాక్షాత్తూ డీజీపీ గౌతం సవాంగ్ ప్రతిపక్షం అంటూ మాట్లాడటం కన్నా నీచం..ఘోరం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. పాలకపక్షానికి కోసి ప్రతిపక్షాలను వేధించడం పోలీసు వ్యవస్థ పని కాదన్నారు. Also Read : శ్రీవారి బ్రాండ్ అగర్‌బత్తీలు.. ప్రత్యేకతలు ఇవే ..!


ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని చిత్తూరు జిల్లాలో పోలీసులు తొలగించడాన్ని ఖండించారు. అక్కడ ప్రార్థన చేసే వారు కూడా ఐదారుగురు కూడా లేరని కానీ పోలీసులు మాత్రం పదుల సంఖ్యలో వచ్చి అక్కడి వారిని అరెస్ట్ చేశారన్నారు. దానికి సంబంధించిన వీడియోలను కూడా రఘురామకృష్ణరాజు ప్రదర్శించారు. అలాగే కాకినాడ దగ్గర పేదల ఇల్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన ఆవ భూములు నీట మునగినవిషయాన్ని రఘురామరాజు వీడియో ప్రదర్శించారు. రెండేళ్లలో నాలుగు సార్లు నీట మునిగాయని.. జగన్‌కు తెలియకుండాఆ భూముల్ని ప్రభుత్వంతో కొనిపించారని ఆరోపించారు.  దీని వెనుక పెద్దలు ఉన్నారని విచారణ జరిపించాలని కేంద్రాన్ని కూడా కోరాన్నారు. Also Read : రైతు సమస్యలపై టీడీపీ ఉద్యమం


అలాగే విద్యార్థులకు విద్య అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రఘురామకృష్ణరాజు ఆరోపించారు.  పేద విద్యార్థులను ప్రభుత్వమే ఎంపిక చేసి వారికి పేరొందిన కార్పొరేట్‌ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించాలనే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డా.వై.యస్.రాజశేఖర రెడ్డి  మొదలుపెట్టిన "బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల" పథకాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.  ప్రజల్ని కేటగిరిల వారీగా విభజించి వివక్షచూపించడం సరి కాదన్నారు. Also Read : అమరావతి అసైన్డ్ ప్లాట్లు దళిత రైతులవే..!