Minister Gottipati Ravikamar made food arrangements for the flood victims :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. భారీ వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు తన వంతు సహాయం అందించారు. విజయవాడ, బాపట్ల, రేపల్లె వంటి ప్రాంతాల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న వరద బాధితుల కోసం సుమారు కోటి రూపాయలకు పైగా ప్రత్యక్ష సాయాన్ని అందించారు. వరద బాధితుల అండగా నిలబడేందుకు తొలి రోజు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అద్దంకి నియోజకవర్గం నుంచి ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, పాలును అందించారు. 


ఖర్చుకు వెనుకాడకుండా ఆహార పంపిణీ 


తొలి రోజు సుమారు 40 వేలకు పైగా ఆహార ప్యాకెట్లును విజయవాడలోని సింగ్ నగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పంపిణీ చేశారు. ప్రతీ ఒక్క ఆహార ప్యాకెట్ తో పాటు వాటర్ బాటిల్ కూడా ఉంచారు. అంతేగాక అదే రోజు మరో 25 వేల వాటర్ బాటిళ్లను బాధితుల కోసం పంపించారు. రెండో రోజూ కూడా అరవై వేల ఆహార ప్యాకెట్లను, వాటర్ బాటిళ్లను విజయవాడలోని రాజరాజేశ్వరి నగర్, సింగ్ నగర్ ప్రాంతాలతో పాటు సొంత జిల్లా బాపట్లలోని పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు పంపిణీ చేశారు.                 


వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు - పరారీలో ఉండగా పట్టుకున్న పోలీసులు


వరుసగా మూడు రోజుల పాటు పంపిణీ 


మూడు రోజు వరదల్లో చిక్కుకున్న చిన్నపిల్లలు, వృద్ధుల కోసం 15 వేల పాల ప్యాకెట్ల, 30 వేల వాటర్ బాటిళ్లను సేకరించి విజయవాడలోని ఓల్డ్ రాజరాజేశ్వరి పేటకు పంపించారు. అంతేగాకుండా బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలకు కూడా పాల ప్యాకెట్లతో పాటు వాటర్ బాటిళ్లను అందించారు. నాలుగో రోజు గొల్లపూడి, సింగ్ నగర్, వైఎస్ఆర్ కాలనీ లోని వరద బాధితులకు పాల  ప్యాకెట్లతో పాటు, మంచి నీటి బాటిళ్లను అందించారు. మొత్తంగా గడిచిన నాలుగు రోజులుగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ వరద బాధితుల కోసం కోటి రూపాయిల మేర  సాయాన్ని అందించారు. 


సత్యవేడు ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు - వీడియోలు రిలీజ్ చేసిన బాధితురాలు!


చేయగలిగిన సాయం చేశానని మంత్రి గొట్టిపాటి సంతృప్తి                             


విజయవాడ, బాపట్ల లోని వివిధ ప్రాంతాల్లో వరద బాధితులకు తాను చేయదగిన సాయం అందించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒకవైపు బాపట్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూనే తన అనుచరులతో సాయంతో బాధితులకు ఎప్పటికప్పుడు ఆహారం, నీరు, పాలు అందించగలిగినట్లు పేర్కొన్నారు. వరద బాధితులకు సాయం చేసేందుకు దాతలు కంపెనీలు ముందుకు రావాలని కోరారు. మంత్రి గొట్టిపాటి తన వ్యక్తిగత సొమ్మును భారీగా వెచ్చించి చేసిన సాయం పట్ల వరద బాధితులు సంతృప్తి వ్యక్తంచేసారు.