Chandrababu Floods Visit: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. విజయవాడలో వరద ప్రాంతాలను చంద్రబాబు పరిశీలిస్తుండగా ఆయన రైలు రూపంలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆయనకు అతి దగ్గర నుంచి రైలు అత్యంత వేగంగా దూసుకొని వెళ్లింది. మధురానగర్ రైల్వే ట్రాక్‌పై సీఎం చంద్రబాబు పరిశీలన చేస్తుండగా ఈ ఘటన జరిగింది. అదే సమయంలో ట్రాక్‌పైకి ఓ రైలు వేగంగా వచ్చింది. 


ట్రైన్‌ను చూసి వెంటనే అప్రమత్తమైన సీఎం సెక్యూరిటీ సిబ్బంది.. ఆయన్ను పక్కకు తప్పించారు. అందరూ కలిసి బ్రిడ్జి రెయిలింగ్‌ అంచున నిలబడ్డారు. దీంతో చంద్రబాబుకు కొన్ని ఫీట్ల గ్యాప్‌ నుంచే రైలు దూసుకెళ్లింది. బుడమేరు కింద నుంచి ప్రవహిస్తుండటంతో సరిగా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు.. సీఎం చంద్రబాబు. ఆ తర్వాత కార్యకర్తలు లైన్‌మెన్‌ను తీసుకువచ్చి ఎర్రజెండా ఊపించడంతో ట్రైన్ ఆగింది.