MLC Lella Appireddy was arrested in the case of attack on TDP office : వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ ఆఫీసుపై గతంలో గాడి చేసిన కేసులో ఆయన కీలక వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయనకు మందస్తు బెయిల్, అరెస్టు నుంచి రక్షణ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. దాంతో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే నిఘా పెట్టిన పోలీసులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని అరెస్టు చేశారు. 


టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అప్పిరెడ్డి నిందితుడు                                


వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై  వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆ సమయంలో సీసీ ఫుటేజీ దృశ్యాలు ఉన్నప్పటికీ అప్పట్లో పోలీసులు కేసులు పెట్టలేదు. తనను అసభ్యంగా  దూషించినందున తన అభిమానస్తులకు బీపీ వచ్చి దాడి చేసి ఉంటారని స్వయంగా అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ సమర్థింపుగా మాట్లాడటంతో పోలీసులు కూడా ముందుడుగు వేయలేకపోయారు. అయితే ఇటీవల ప్రభత్వం మారింది. ప్రభుత్వం మారిన వెంటనే.. కేసులో కదలిక వచ్చింది. సీసీ ఫుటేజీతో పాటు కాల్ లిస్ట్ బ యటకు తీసి విచారణ జరిపారు. ఇందులో పాల్గొన్న వారిని పెద్ద సంఖ్యలో అరెస్టులు చేశారు. 


రైలు పట్టాలపై చంద్రబాబు, ఇంతలోనే వేగంగా దూసుకొచ్చిన రైలు


అరెస్టు నుంచి  రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ                                 


లేళ్ల అప్పిరెడ్డితో పాటు దేవినేని అవినాష్ అనుచరులు ఈ దాడిలో పాల్గొన్నట్లుగా తేలింది. వీరిద్దరూ టీడీపీ ఆఫీసుకు సమీపంలో కారులో ఉండి..దాడిని ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేశారని.. టీడీపీ ఆఫీసులో ధ్వంసం చేయడానికి వెళ్లిన వారికి సూచనలు ఇచ్చారని పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేశారు. పలువుర్ని అరెస్టు చేయడంతో తమను కూడా అరెస్టు చేస్తారని వీరిద్దరూ కూడా ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. అయితే విచారణ జరిపిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. రెండు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కావాలని వీరు  చేసిన విజ్ఞప్తిని కూడా తిరస్కరించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 


అరెస్ట్ భయంతో ఆజ్ఞాతంలో వైసీపీ ముఖ్య నేతలు - ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు


నందిగం సురేష్‌కు రెండు వారాల రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు                   


మాజీ ఎంపీ నందిగం సురేష్ హైదరాబాద్ పారిపోవడంతో ఆయనను హైదరాబాద్ వెళ్లి అరెస్టు చేసి తీసుకు వచ్చి మంగళగిరి కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆయనకు రెండు వారాల రిమాండ్ విదించింది. మరికొంత మంది లీడర్లను కూడా.. అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.