ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. పాఠశాలలో అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని గ్రీన్‌ బోర్డుపై ‘ఆల్‌ ద వెరీ బె​స్ట్‌’ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలోని ప్రతి తరగతి గదిలోకి వెళ్లిన సీఎం జగన్‌ విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై సీఎం జగన్‌కు వివరించారు.


Also Read:- AP CM YS Jagan: పోతవరం జెడ్పీ స్కూల్‌‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్.. భుజాన స్కూల్ బ్యాగు.. లైవ్ అప్‌డేట్స్


విద్యార్థులకు అంకితం


ప్రస్తుతం పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలపై సీఎం జగన్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్కూల్‌ బ్యాగ్‌లను పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహారానికి కూడా పరిశీలించారు. అనంతరం ‘మనబడి నాడు-నేడు’ పైలన్‌ ను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పాఠశాలల్లో కరోనా ఆంక్షలు పాటిస్తున్నామని, పాజిటివిటీ రేటు 10 శాతం కంటే తక్కువ ఉన్న చోట పాఠశాలలు తెరిచామని సీఎం జగన్‌ అన్నారు. పేద విద్యార్థుల జీవితాల్లో మార్పులు రావాలనేదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పోతవరంలో మొదటి విడత ‘నాడు-నేడు’ నిధులతో అభివృద్ధి చేసిన పాఠశాలలను విద్యార్థులకు అంకితమిచ్చారు సీఎం జగన్. అనంతరం జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. 


Also Read: AP Schools Reopen: ఏపీలో బడి గంట మోగింది... కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తెరుచుకున్న విద్యా సంస్థలు


42 లక్షల విద్యార్థులకు ప్రయోజనం


సీఎం జగన్‌ మాట్లాడుతూ.. తరగతి గదిలో 20 మంది కంటే ఎక్కువ విద్యార్థుల్ని ఉంచవద్దన్నారు. ఎక్కువ మంది విద్యార్థులుంటే రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు సహా అన్ని వస్తువులు అందజేస్తున్నామని తెలిపారు. విద్యాకానుక కింద రెండు భాషల్లో పాఠ్యపుస్తకాలు, బ్యాగు అందిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థికీ నోట్‌ బుక్స్‌, వర్క్‌ బుక్స్‌, డిక్షనరీ, 3 జతల దుస్తులు, బూట్లు, బెల్టు, సాక్సులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద రూ.1,380 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. దీంతో 42 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోందన్నారు. 
Also Read:  AP CM Jagan Speech: 26 నెలల పాలన చూడండి.. మార్పు గమనించండి.. పంద్రాగస్టు వేదికపై నుంచి ఏపీ సీఎం జగన్ అభ్యర్థన


జగనన్న విద్యా కానుక పంపిణీ
 
మన బడి నాడు-నేడు ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో 15,715 ప్రభుత్వ స్కూళ్లలో అభివృద్ధి పనులు చేశారు. నేటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యాయి. రెండో విడత చేపట్టబోయే పాఠశాలల పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో ముఖ్యంత్రి ప్రారంభించారు.


Also Read: Independence Day 2021 in AP Live: జెండా ఆవిష్కరించిన సీఎం జగన్.. పోలీసుల నుంచి గౌరవ వందనం