AP CM YS Jagan: పోతవరం జెడ్పీ స్కూల్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్.. భుజాన స్కూల్ బ్యాగు.. లైవ్ అప్‌డేట్స్
నేటి నుంచి ఏపీలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పాఠశాలలను విద్యార్థులకు అంకితం చేయనున్నారు.
పోతవరం జెడ్పీ స్కూల్‌లో విద్యార్థుల పాఠ్య పుస్తకాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. భుజాన స్కూల్ బ్యాగ్ వేసుకుని తన స్కూల్ రోజులను గుర్తు సీఎం గుర్తుచేసుకున్నారు. క్లాస్ రూమ్‌లోకి వెళ్లిన సీఎం విద్యార్థుల పక్కనే బెంచీ మీద కూర్చున్నారు.
పి.గన్నవరం మండలం పోతవరంలోని జడ్పీ హైస్కూల్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. పాఠశాలలో సౌకర్యాలు పరిశీలించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ఏపీ సీఎం ముచ్చటించారు.
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పి. గన్నవరం మండలం పోతవరం చేరుకున్నారు. అక్కడ మంత్రులు, అధికారులు ఏపీ సీఎంకు ఘన స్వాగతం పలికారు.
తాడేపల్లిలోని నివాసం నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు బయలుదేరారు. మరో గంట సమయానికి పి.గన్నవరం మండలంలోని పోతవరం చేరుకుంటారు.
సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఏపీ మంత్రులు ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కలెక్టర్, ఇతర అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. నేటి కార్యక్రమంలో జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు ఏపీ సీఎం జగన్ కిట్లు పంపిణీ చేయనున్నారు.
నేటి ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరతారు
ఉదయం 11 గంటల ప్రాంతంలో తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని పోతవరం గ్రామానికి వైఎస్ జగన్ చేరుకుంటారు
పోతవరం నుంచి పి.గన్నవరం చేరుకుని నాడు నేడు ద్వారా ఆధునికీకరించిన జెడ్పీ స్కూలును ఈ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించనున్నారు.
నాడు నేడులో భాగంగా రెండో విడత ఆధునికీకరణ పనులు చేపట్టబోయే స్కూళ్ల పనులకు ఏపీ సీఎం శ్రీకారం చుడతారు.
నాడు-నేడు పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
నేటి మధ్యాహ్నం దాదాపు ఒకటిన్నర గంటల సమయంలో పోతవరం నుంచి తాడేపల్లికి తిరుగుపయనం. మధ్యాహ్నం 2.30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకోనున్నారు.
Background
ఏపీలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. మనబడి నాడు–నేడు ద్వారా రూ.3,669 కోట్లతో తొలి విడతలో 15,715 స్కూళ్లను ఆధునీకరిస్తోంది ఏపీ సర్కార్. తొలి విడత పనులు పూర్తి కాగా, నేటి నుంచి ఏపీలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఆ పాఠశాలలను విద్యార్థులకు అంకితం చేయనున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -