హోటల్ ముందు ఓ కారు ఆగివుంది. అందులో ఓ జంట కూర్చొని ఉంది. హోటల్‌లోకి వెళ్లేందుకు ఆ జంట కారు దిగారు. అంతే.. ఓ మహిళ అమాంతంగా వారి మీదకు ఉరికింది. యువతి జుట్టు పట్టుకుంది. ఆమె మరెవ్వరో కాదు.. ఆ కారులో కూర్చొన్న వ్యక్తి భార్య. ఆమె చేతిలో తన్నులు తిన్న యువతి.. అతడి ప్రియురాలు. ఇద్దరు కలిసి హోటల్‌లో ఎంజాయ్ చేద్దామని భావించారు. కానీ, భార్య వచ్చి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసుకుంది. 


ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో చోటుచేసుకుంది. భర్త ప్రవర్తనపై అనుమానం కలిగిన ఓ భార్య అతడిపై నిఘా పెట్టింది. ఓ యువతితో అతడు కారులో వెళ్లడం చూసి అతడిని వెంబడించింది. హోటల్ పార్కింగ్‌లో నిలిపి ఉన్న కారులో ఆమె భర్త మరో అమ్మాయితో కలిసి ఉండటం చూసి చిర్రెత్తుకొచ్చింది. పరుగు పరుగున వచ్చి ఆ యువతిని పట్టుకుంది. ఎవరు ఆమె అంటూ భర్తపై గట్టిగా అరిచింది. ఆ యువతి చున్నీతో ముఖాన్ని కప్పుకొనే ప్రయత్నిస్తుండగా దాన్ని లాగేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


Also Read: విటమిన్-డి లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!


ఈ వీడియో చూసిన నెటిజనులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.  ఆమెను కొట్టడం వల్ల ఫలితం ఉండదని, భర్తను కొట్టాలని సలహాలిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ఆ వీడియో ‘భార్య, భర్త.. ఓ ప్రియురాలు..’ డ్రామాను చూడకుండా ఆ హోటల్‌ సెక్యూరిటీ గార్డును చూశారు. భార్య పరుగున వెళ్లి ఆ యువతిని పట్టుకోగానే  సెక్యూరిటీ గార్డు నెమ్మదిగా హోటల్‌ లోపలికి వెళ్లడం చూసి.. అంతా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇంకా కాసేపు ఆగి ఉంటే.. వారిద్దరు హోటల్‌ రూమ్‌లోకి వెళ్లేవారని, అప్పుడు పట్టుకుంటే మరింత రంజుగా ఉంటుందని మరికొందరు అంటున్నారు. మొత్తానికి వారి గొడవ నెటిజనులకు వినోదాన్ని పంచుతుంది. ‘‘పాపం.. ఇంట్లో పప్పు, కూర వదిలేసి.. బయట బిర్యానీకి ఆశపడ్డాడు. అడ్డంగా బుక్కైపోయాడు’’ అనే క్యాప్షన్ కూడా ఈ వీడియోకు సరిగ్గా సరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరూ చూసేయండి. 


వీడియో:


Also Read: 335 మందితో డేటింగ్.. స్ఫూర్తి నింపుతున్న యువకుడి డేరింగ్ స్టెప్, మరో 30 మందిని కలిస్తే..


Also Read: రమణ్ కాదు రాక్షసుడు.. 41 మందిని చంపాడు, చివరికి కోడి కూర తిని..


Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!