రేపు అనేది అందరికీ భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్... జాతీయ పతాకాన్న ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కొత్త లక్ష్యాలతో సాగాల్సిన టైం
కొత్త లక్ష్యాలు నిర్దేశించుకొని సాగాల్సిన టైం ఇదని... అందుకే ఆ దిశగానే తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు ముఖ్యమంత్రి జగన్. హక్కులు అందరికీ అందాలని... పాలన కూడా అదే మాదిరిగా ఉండాలని ఆకాంక్షించారు జగన్. తాము పారదర్శక పాలన అందిస్తున్నామని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రయోజనం చేసేలా పథకాలు తీసుకొస్తున్నామని.. అమలు చేస్తున్నామన్నారు. 26 నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ వాళ్ల క్షేమం కోసం తీసుకొచ్చనవేనన్నారు సీఎం.
పాదయాత్రలో చూశాను.. విన్నాను.. చేస్తున్నాను.
పాదయాత్రలో చాలా మంది సమస్యలు చూశానని... పాలన మొత్తం వాళ్ల సమస్యలు తీర్చడానికే చూస్తున్నామన్నారు. ముఖ్యంగా వ్యవసాయం రంగంపై 83 వేల కోట్ల ఖర్చు పెట్టామని గుర్తు చేశారు జగన్. వ్యవసాయానికి డే టైంలోనే క్వాలిటీ విద్యుత్ ఇస్తున్నామని... రైతుభరోసా కింద ఏటా రూ.13,500 విడుదల చేస్తున్నామన్నారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటివరకు రూ.17వేల కోట్లు ఇచ్చామని, 31 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా అందించామని జగన్ గుర్తు చేశారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు సేకరణ కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు.
చిరునవ్వు చూస్తున్నాం
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టి న కార్యక్రమాలను పంద్రాగస్టు ప్రసంగంలో జగన్ వివరించారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రుణాలు సైతం రైతులకు, మహిళలకు, వివిధ వర్గాలకు అందించామని వాళ్ల మొహాల్లో చిరునవ్వు చూశామన్ననారు జగన్ మోహన్ రెడ్డి.
నాడు-నేడు తేడా గమనించండి
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో ప్రజలు గమనించాలని సూచించారు సీఎం జగన్. విప్లవాత్మకమైన గ్రామ సచివాలచయాలు తీసుకొచ్చి ఐదు వందలకుపైగా పౌరు సేవలను అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఇలాంటి ఇదో విప్లవాత్మకైనా అడుగ్గా అభివర్ణించారు జగన్. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షా ముఫ్పై వేల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్‌లు ఇంటి వద్దకే వస్తున్నాయని... విత్తనం, ఎరువులు కూడా ఊరిలోనే దొరుకుతున్నాయన్నారు.
బడి రూపు మారుతోంది
విద్యావ్యవస్థలో నూతన శకానికి నాందిపలికామని... నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలే మార్చేశామన్నారు సీఎం జగన్. కార్పొరేట్ స్కూల్స్‌కు పోటీగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దామన్నారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించేందుకు కూడా పథకాలు తీసుకొచ్చామని.. జగనన్న గోరుముద్ద ద్వారా వాళ్ల ఆకలి తీరుస్తున్నామని పేర్కొన్నారు.
మహిళలకు దిశ చూపించాం
బడి ఈడు పిల్లలు ఎవరూ చదువుకు దూరంగా ఉండకూడదన్న ఉద్దేశంతో అమ్మఒడి తీసుకుందామని...రెండేళ్లలో ఈ పథకం ద్వారా 13వేల కోట్లు వారివారి ఖాతాల్లో వేశామన్నారు సీఎం జగన్ మోహన్‌రెడ్డి. డ్వాక్రా మహిళలకు ఇప్పటి వరకు 6500కోట్లు అందించామన్నారు. వైఎస్‌ఆర్ చేయూత స్కీమ్ ద్వారా 9వేల కోట్లు జమ చేసినట్టు పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం దిశ చట్టం తెచ్చిన సంగతి గుర్తు చేశారు. దిశ యాప్ అందరూ డౌన్ లోడ్ చేసుకొని సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు సీఎం.