తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు కురవనున్నట్లుగా వాతావరణ విభాగం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అది సముద్రమట్టానికి కి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తువరకు కొనసాగుతోందని చెప్పారు. ఈ ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.


ఆగస్టు 14 రాత్రివేళ హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. మర్నాడు అంటే ఆగస్టు 15న రాత్రి వరకూ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని సూచించారు. దీనికి సంబంధించిన హెచ్చరిక కూడా జారీ చేశారు.


Also Read: 75th Independence day: ఎర్రకోట మీదనే ప్రధాని ఎందుకు జెండా ఎగరేస్తారు? ఏంటీ దాని ప్రత్యేకత? 


తెలంగాణలో ఈ జిల్లాల్లోనే వానలు పడే అవకాశం
హైదరాబాద్‌లోని వాతావరణ విభాగం అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, కామారెడ్డి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. కానీ, అల్పపీడన ప్రభావంతో మరో రెండ్రోజుల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు.


Also Read: Independence Day:1947 స్వాతంత్య్ర వేడుకల్లో మహాత్మా గాంధీ ఎందుకు లేరు.. అప్పుడు జరిగిన ఇంట్రస్టింగ్ సంగతులు ఇవే..


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నందున రానున్న రెండు రోజుల్లో అది తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్‌ ఉన్నట్లు పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.


Also Read: Independence Day 2021: పంద్రాగస్టు వేడుకలు.. ప్రధాని మోడీ షెడ్యూల్ ఇదే.. దేశ రాజధానిలో హైఅలర్ట్


Also Read: Bigg Boss Telugu Season 5 Promo: బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ప్రోమో.. బోర్‌డమ్‌కు గుడ్‌బై అంటూ గన్ పట్టిన నాగ్!