భారత్‌లో గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆగస్టు 15న బంగారం ధరలో గ్రాముకు రూ.29 చొప్పున ఎగబాకింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ (ఆగస్టు 15)న రూ.46,150 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా తాజాగా రూ.47,150గా ఉంది. మొత్తానికి గత వారం రోజులతో పోలిస్తే బంగారం ధర కాస్త పెరిగింది.


భారత మార్కెట్‌లో బంగారం ధరలు పెరగ్గా వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. గ్రాముకు రూ.0.70 పైసలు చొప్పున పెరిగి.. కేజీ వెండికి రూ.700 వరకూ వ్యత్యాసం ఏర్పడింది. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.63,200 గా ఉంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.900 వరకూ పెరిగింది. దీంతో ప్రస్తుతం ధర రూ.68,200గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 15న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.


Also Read: Independence Day:1947 స్వాతంత్య్ర వేడుకల్లో మహాత్మా గాంధీ ఎందుకు లేరు.. అప్పుడు జరిగిన ఇంట్రస్టింగ్ సంగతులు ఇవే..


ఆంధ్రా, తెలంగాణలో పసిడి, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,000 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.44,000 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.68,200గా పలికింది.


ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ఆగస్టు 15న రూ.44,000 కు పెరిగింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,000గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,200గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,000 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉంది. ఇక్కడ వెండి ధర కిలో రూ.68,200 గానే కొనసాగుతోంది.


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 15న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,150ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,150గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గా ఉంది. 


Also Read: 75th Independence day: ఎర్రకోట మీదనే ప్రధాని ఎందుకు జెండా ఎగరేస్తారు? ఏంటీ దాని ప్రత్యేకత? 


ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర మాత్రం ఆగస్టు 15న పెరిగింది. కొద్ది రోజులుగా ప్లాటినం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. గ్రాముకు రూ.19 వరకూ పెరిగింది. దీంతో తాజా ధర.. రూ.2,427గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,270 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది. 


అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.


Also Read: Independence Day 2021: పంద్రాగస్టు వేడుకలు.. ప్రధాని మోడీ షెడ్యూల్ ఇదే.. దేశ రాజధానిలో హైఅలర్ట్


Also Read: Bigg Boss Telugu Season 5 Promo: బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ప్రోమో.. బోర్‌డమ్‌కు గుడ్‌బై అంటూ గన్ పట్టిన నాగ్!