Kurnool Crime News Today:కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో దారుణం చోటుచేసుకుంది. చెల్లెలిచెలిమా గ్రామంలో మైనర్‌పై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించడంతో భయపడిన బాలిక కేకలు వేసింది. దీంతో అక్కడే ఉన్న గ్రామస్తులు ఆ ప్లేస్‌కు చేరుకున్నారు. గ్రామస్తులు చేరుకుంటున్నారని తెలుసుకున్న ఆ యువకుడు బాలికను అక్కడే వదిలేసి పారిపోయాడు. 


గురువారం సాయంత్రం యథావిధిగా స్కూలు నుంచి ఇంటికి వచ్చింది బాలిక. పాల కోసం ఇంటి సమీపంలోని పాల కేంద్రానికి వెళ్లి వస్తుండగా యువకుడు వచ్చి ఆమెతో మాట్లాడాడు. కోరిక తీర్చాలని వెంటపడినట్టు స్థానికులు చెబుతున్నారు. లేకుంటే చంపేస్తానంటూ బెదిరించారు. 


యువకుడి మాటలకు భయపడిపోయిన ఆ బాలిక పరుగెత్తుకొని వెళ్లే ప్రయత్నం చేసింది. యువకుడు ఆమెను వెంటాడుతూ వచ్చాడు. తప్పించుకోలేని గ్రహించిన బాలిక గట్టిగా కేకలు వేసింది. వెంటనే అక్కడకు గ్రామస్తులు పరుగు పరుగున చేరుకున్నారు. 


గ్రామస్తులు వచ్చేసరికి సమీపంలో ఉన్నవారు రావడంతో సదరు వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులకు కూడా బాలిక చెప్పింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తనపై అత్యాచారానికి యత్నించాడని వివరించింది.


అత్యాచారం చేయబోయాడనే విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో వెంకటేశ్వర్లుకు దేహశుద్ధి చేశారు. అంతే కాకుండా అతని ఇంటిపై కూడా దాడి చేశారు. పెట్రోల్‌ పోసి తగలబెట్టారు.  దీంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది.  


గ్రామస్తులు కొడుతుండగా వారి నుంచి వెంకటేశ్వర్లు తప్పించుకొని పారిపోయాడు. ఆ కోపంతోనే ఆయన ఇంటిని గ్రామస్తులలు తగలబెట్టారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లారు. ఏం జరిగిందో ఆరా తీశారు. 


మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వెంకటేశ్‌వర్లును కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు. 


Also Read: కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు