Morning Top News:
ఇందిరా ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ పాలన
తెలంగాణలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్, మార్పు అంటూ అధికారం చేజిక్కించుకుని రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటం తప్పించి మరే మార్పు తీసుకురాలేదని దుయ్యబట్టారు. నిర్భందాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప రేవంత్ తెచ్చిన మార్పు ఏమీ లేదని విమర్శించారు.
రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పోలీసులను దూషించిన కేసులో కౌశిక్‌కు బెయిల్
ఫిర్యాదుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారితో వాగ్వాదం దిగిన కేసులో కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. అర్థరాత్రి వేళ ఐదు వేల రూపాయల స్వంత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. కౌశిక్‌తోపాటు ఇతర నాయకులను అరెస్టు చేయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన బీఆర్‌ఎస్ ఇవాళ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళన నేపథ్యంలో చాలా మంది గులాబీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
వైసీపీ ప్రచారంపై అల్లు అర్జున్ స్పందించే ఛాన్స్ !
పుష్ప 2తో అల్లు అర్జున్ మరోసారి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే ఇందులో డైలాగుల వెర్షన్ మార్చేస్తూ వైసీపీ భారీ ప్రచారం చేసింది. అనని డైలాగుల్ని లేని డైలాగుల్ని.. ఉన్న వాటికి కూడా అర్థాలు మార్చేసి మెగా కుటుంబంపై విరుచుకుపడినట్లుగా ప్రచారం చేశారు. వీటిపై అల్లు అర్జున్ ఇంకా స్పందించలేదు. అయితే వైసీపీ రాజకీయంగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తే.. అల్లు అర్జున్ కచ్చితంగా తిప్పికొట్టే అవకాశం ఉంది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తా: వీఎస్ఆర్
చంద్రబాబుకు మతి భ్రమించి ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ YCP MP విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ‘అందరినీ క్రిమినల్ అంటాడు.. కానీ, చంద్రబాబే ఒక క్రిమినల్. KVరావు ఒక బ్రోకర్.. చంద్రబాబుకు చెంచా. కాకినాడ పోర్టును తన బినామీ KVరావుకు కట్టబెట్టడానికే బాబు నాటకాలు. నాపై లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరమేంటి? KVరావు, చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తా’ అని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
వైసీపీ నేతలపై కేసులు.. బెయిల్ కోసం పరుగులు
ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కేసుల హడావుడి జరుగుతున్న సమయంలో అంత కంటే తీవ్రమైన కేసులు కొన్ని వెలుగులోకి వచ్చాయి.ఏపీలో మాఫియా తరహాలో గత పాలకులు వ్యవహరించి ఆస్తుల్ని లాక్కున్నారని సాక్షాత్తూ చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ముఖ్య నేతలందరిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ముందస్తు బెయిల్స్ కోసం వారు న్యాయస్థానాలకు పరుగులు పెడుతున్నారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అమరావతిలో 25 ఎకరాల పొలం కొన్న మైక్రోసాఫ్ట్
ప్రపంచ దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మైక్రోసాఫ్ట్ సంస్థ నందిగామ వద్ద పాతిక ఎకరాల భూమిని రూ. 181 కోట్లుపెట్టి కొనుగోలు చేసినట్లుగా జాతీయ మీడియా వెల్లడించింది. నందిగామ అమరావతి నుంచి అరవై కిలోమీటర్ల దూరం ఈ స్థలం ఉంది. అక్కడ నాట్కో ఫార్మా, టైమ్ క్యాప్ ఫార్మా అనే కంపెనీలకు భూమి ఉంది.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్
మహారాష్ట్రలో 'మహాయుతి' ప్రభుత్వం కొలువుదీరింది.
బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడణవీస్ సీఎంగా, శివసేన అధినేత ఏక్‌నాథ్ శిందే, ఎన్సీపీ అగ్రనాయకుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదానంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం
చంద్రబాబు, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతాం
వైసీపీ పాలనలో నిర్వీర్యమైన ఏపీ విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాబోయే 6 నెలలకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, సరఫరాతో పాటు పలు అంశాలను చర్చించారు. 6 నెలలకు సంబంధించి విద్యుత్ వినియోగం, డిమాండ్లకు అనుగుణంగా ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలి అనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాలు ప్రజలకు భారం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
భారత్‌ను పదే పదే రెచ్చగొడుతున్న బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ఉద్దేశపూర్వకంగా సరిహద్దుల్లో అలజడి పెంచేలా వ్యవహరిస్తూ భారత్ ను రెచ్చగొడుతోంది. పరిస్థితి ఎలా ఉందంటే చివరికి యుద్దానికి కూడా సిద్ధమని అంటున్నట్లుగా అక్కడి తాత్కలిక పాలకులు బెదిరింపులకు దిగుతున్నారు. ఇది ప్రశాంతంగా ఉండే భారత్ కూడా యుద్ధానికి సన్నద్ధం అయ్యేలా చేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కాలిఫోర్నియాలో 7.0 తీవ్రతతో భారీ భూకంపం
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు శాన్ ఫ్రాన్సిస్కో వరకు వచ్చాయి. సునామీ హెచ్చరిక కూడా అధికారులు జారీ చేశారు. కాసేపటికే దానిని ఉపసంహరించుకున్నారు. భూకంపం ప్రభావంతో అక్కడి 5.3 మిలియన్ల మంది ప్రజలు భయాందోళలకు గురయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..