Byreddy Rajasekhar Reddy About Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయ్యాక రాయలసీమకు అత్యంత అన్యాయం జరిగిందని రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, నిమాయకాల అంశాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ మూడు అంశాల్లో రాయలసీమకు సమాన వాటా ఇవ్వాలని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. సేవ్ రాయలసీమ నినాదంతో జులై 28న ఛలో దిల్లీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను అడిగిన జగన్ సీఎం అయ్యాక మాత్రం రాయలసీమకు చేసిందేమీ లేదన్నారు.


నమ్మి అవకాశమిస్తే రాయలసీమకు అన్యాయం చేసిన సీఎంలలో జగన్ ఒకరిగా మారారని ఎద్దేవా చేశారు. రాయలసీమకు వైసీపీ ప్రభుత్వం ఏం చేశారో చెప్పాలని బైరెడ్డి ప్రశ్నించారు. ఇంకా చెప్పాలంటే జగన్ ఏపీ సీఎం అయ్యాకే రాయలసీమకు మరింత అన్యాయం జరిగిందన్నారు. ఈ గడ్డ కోసం పోరాటం చేయాలనుకునే వారు, ఛల్లో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఛలో ఢిల్లీలో సీఎం జగన్ సైతం పాల్గొని వెనుకబడిన రాయలసీమ ప్రాంత సమస్యలపై కేంద్రానికి వినతిపత్రం ఇవ్వాలని కోరారు. ఛలో ఢిల్లీతో ఏపీలో రాజకీయం మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. 


న్యాయ రాజధాని పెద్ద మోసం..
వైసీపీ ప్రభుత్వం ఏపీలో మూడు రాజధానులు అని, విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానులు ప్రకటించిందన్నారు. అయితే కర్నూలులో ఏర్పాటు చేస్తామన్న న్యాయ రాజధాని పెద్ద మోసమన్నారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. దాని వల్ల రాయలసీమకు గానీ, యువతకు ఏం ప్రయోజనం లేదన్నారు. న్యాయ రాజధానితో ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయ రాజధాని పేరుతో ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో జిరాక్స్ షాపుల వాళ్లు, చిరుతిండి విక్రయించే వారు ఓ 10 మంది బతుకుతారు. కానీ మిగతా వారికి ఏ ప్రయోజనం ఉండదని ప్రజలు గుర్తించారని చెప్పారు. రాయలసీమకు ఏం చేయకున్నా, నీళ్లు ఇవ్వకున్నా అధికార వైసీపీ నాయకులు గర్జనలు నిర్వహించడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో డెవలప్ మెంట్ కు బదులుగా ఎక్కడ కొందరు కనిపించినా మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుకుంటున్నారని తెలిపారు. వివేకాను ఒంటరిని చేసి చంపేశారని ఆరోపించారు.
Also Read: Nara Lokesh: నాకు కూతురు పుట్టాలని దేవుడ్ని కోరుకున్నాను- మహిళలతో ముఖాముఖీలో నారా లోకేశ్ 


వైసీపీ ఎంపీ భార్య, కుమారుడ్ని కిడ్నాప్ చేశారు. ఎన్నారైను సైతం ఎత్తుకుపోయారుని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నారు. నీళ్లు, నిధులు, సంస్థలు, కంపెనీలతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కానీ ఏదో విరిగిన బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తున్నారంటూ న్యాయ రాజధానిపై సెటైర్లు వేశారు. దమ్ముంటే అప్పర భద్ర ఆపాలన్నారు. తీగల వంతెన బదులుగా, బ్రిడ్జి కమ్ బ్యారేజీ కట్టాలన్నారు. గుండ్రెవుల, వేదవతి కట్టాలని.. రేపు అప్పర్ భద్ర కడితే పులివెందులకు నీళ్లు రావని ఇకనైనా సీఎం జగన్ స్పందించి చర్యలు తీసుకోవాలని బైరెడ్డి కోరారు. 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial