కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయలేమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూటిగా.., సుత్తి లేకుండా స్పష్టం చేశారు. టెక్నికల్ ఇష్యూస్ తెలియక సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన ఉద్యోగసంఘాలతో భేటీ తర్వాత మీడియాతో వ్యాఖ్యానించారు. సీపీఎస్ రద్దు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని లెక్కలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు చేయడం అసాధ్యం కాబట్టి... వారికి పెన్షన్ సెక్యూరిటీ ఎలా అని ఆలోచిస్తున్నామన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ఉద్యోగ సంఘాలలో సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో.. మేనిఫెస్టోలో ఉద్యోగును ఆకర్షించిన ప్రధానమైన హామీ సీపీఎస్ రద్దు. తాను అధికారంలోకి వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టగానే కమిటీ వేశారు. మొత్తంగా మూడు కమిటీలు సీపీఎస్ రద్దుపై పని చేస్తున్నాయి. గత ప్రభుత్వంలోనూ ఓ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మూడు ప్రతిపాదనలు సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే అవి అమలు చేయక ముందే ప్రభుత్వం మారింది. వాటినీ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు పరిశీలించాయి. కానీ నిర్ణయం తీసుకోలేకపోయారు.
ఇప్పుడు సీపీఎస్ రద్దు సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చినందునే సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా ఆ విషయం ప్రకటించినట్లుగా భావిస్తున్నారు. అయితే సీపీఎస్ రద్దుకు బదులుగా ప్రత్యామ్నాయాలు చూస్తామంటున్నారు. అయితే సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఇప్పటికే రోడ్డెక్కారు. ఉద్యమలు చేస్తున్నారు. ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల కిందట భారీ సభ నిర్వహించి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. సీపీఎస్ రద్దు చేస్తారా.. గద్దె దిగుతారా అని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రద్దు చేయడం సాధ్యం కాదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... వ్యద్ధాప్య పింఛన్లు పెంచుతూ కీలక నిర్ణయం
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కూడా సాధ్యం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి పరోక్షంగా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అవరోధంగా ఉందన్నారు. సీపీఎస్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏ ప్రభుత్వం ఉన్నాచేయాల్సిందేనని .. ప్రత్యామ్నాయాలు చూసి అమలు చేస్తామన్నారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై సజ్జల ప్రకటన రాజకీయ దుమారం కూడా రేపే అవకాశం ఉంది.
Also Read: జగన్ హామీ నెరవేరలేదు.. పైగా జైలు పాలయింది..! టీటీడీ పారిశుద్ధ్య కార్మికులు రాధ దీన స్థితి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి