ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. టిక్కెట్ రేట్లను భారీగా తగ్గిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత పద్దతిలోనే సినిమా టిక్కెట్ రేట్లు ఖరారు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. టిక్కెట్ రేట్లు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని సినిమా ధియేటర్ల యాజమాన్యలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. విచారణ జరిపిన హైకోర్టు జీవో నెంబర్ 35ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 


Also Read: అమెజాన్‌కు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్.. ధరలు 60 శాతం వరకు తగ్గింపు.. ఏ స్ట్రీమింగ్ సర్వీస్ ప్లాన్లు బెస్ట్?


గత ఏప్రిల్‌లో పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం రాత్రికి రాత్రి టిక్కెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. జీవో జారీ చేసింది. ఆ  సినిమా విడుదల సమయంలో కొన్ని చోట్ల టిక్కెట్ రేట్ల పెంపు అంశం హైకోర్టుకు చేరింది. ఆ సమయంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవోలో ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు పదేళ్ల కిందటివని సినిమా ఇండస్ట్రీ గగ్గోలు పెట్టింది.  ప్రభుత్వం విడుదల చేసిన జీవో   ప్రకారం... అత్యంత కనిష్ట ధర రూ.5 కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250. ఈ ధరలు ధియేటర్ల నిర్వహణకు కూడా రావని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. టిక్కెట్ రేట్లు పెంచాలని అదే పనిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం టాలీవుడ్ పేదలను దోచుకుంటోందని అలాంటి చాన్స్ ఇవ్వబోమని చెబుతూ టిక్కెట్ రేట్లను సవరించేందుకు అంగీకరించడం లేదు.  


Also Read: ఏపీ సర్కార్ వారి సినిమా టికెట్ల ధరలివే.. మీ ఊర్లో సింగిల్ టీ కంటే సినిమా టికెట్ రేటే చీప్


టాలీవుడ్‌లో వరుసగా బడా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. పుష్ప , ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, ఆచార్య వంటి సినిమాలు విడుదల కావాల్సి ఉంది. మిగిలిన అన్ని చోట్లా పరిస్థితి బాగానే ఉన్నా ఏపీలో మాత్రం కలెక్షన్లు డల్‌గా ఉంటున్నాయి. బాలకృష్ణ నటించిన అఖండ సినిమా సూపర్ హిట్ అయినా ఏపీలో .. ధియేటర్లు హౌస్ ఫుల్స్ అయినా కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. అతి తక్కువ టిక్కెట్ ధరలు ఉండటమే దీనికి కారణం. ఇప్పుడు పాత పద్దతిలోనే టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు హైకోర్టు కల్పించడంతో  విడుదల కాబోయే పెద్ద సినిమాలకు గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు.


Also Read: థియేటర్లు దొరక్క... పదిహేను రోజులు వెనక్కి వెళ్లిన పూర్ణ సినిమా


ఇటీవల ఏపీ ప్రభుత్వం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అమ్మాలని ప్రభుత్వమే పోర్టల్ నిర్వహించాలని నిర్ణయిస్తూ చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం పోర్టల్‌ను ఇంకా ప్రారంభించలేదు. అప్పుడే టిక్కెట్ ధరలపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని అనుకున్నారు. కానీ ఈ లోపే హైకోర్టు జీవోను సస్పెండ్ చేయడంతో  పాత విధానంలోనే టిక్కెట్ ధరలు ఉండనున్నాయి..


Also Read: పీఆర్సీ పెంపుపై ఉద్యోగ సంఘాలతో సజ్జల భేటీ... సీఎం జగన్ న్యాయం చేస్తారని హామీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి