ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పెట్రోల్ బంకులు మూత పడుతున్నాయి. కొనేవారే కనిపించడం లేదు. ఎందుకంటే బోర్డర్ దాటితే అతి తక్కువకే పెట్రోల్ వస్తోంటే్.. ఎక్కువ ధర పెట్టి ఏపీలోనే కొనాలని ఎందుకనుకుంటారు ? అందుకే కర్ణాటకలో బంకులకు వ్యాపారం పెరిగిదంది.  బోర్డర్‌లో ఉన్న ఏపీ పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. ఇటీవల కేంద్రం పెట్రో ధరలను రూ.ఐదు తగ్గించింది. దానికి తోడు కర్ణాటక మరికొంత తగ్గించింది. ఏపీలో కేంద్రం తగ్గించిన మొత్తం తగ్గింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా తగ్గించడానికి నిరాకరించింది. దీంతో కర్ణాటకలో పెట్రోల్ రేట్లు చవకగా మారాయి.  దీంతో బోర్డర్‌లో ఉన్న ప్రజలంతా కర్ణాటక వెళ్లి పెట్రోల్, డీజిల్ కొట్టించుకుని వస్తున్నారు.


Also Read: పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... వ్యద్ధాప్య పింఛన్లు పెంచుతూ కీలక నిర్ణయం


అనంతపురం జిల్లా  చిలమత్తూరు మండలం లో 9 పెట్రోల్ బంకులు ఉన్నాయి. మండలం కర్ణాటకను ఆనుకుని ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలు మాత్రం పెట్రోల్ డీజిల్ కోసం కర్ణాటకకు పరుగులు తీస్తున్నారు. మన రాష్ట్రంలో కంటే కర్ణాటక రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు బాగా తక్కువగా ఉండటంతో ఇక్కడ వ్యాపారాలు జరగక ఉన్న పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మన రాష్ట్రంలో పెట్రోల్ లీటరు ధర రూ. 111.11 లుగా, డీజిల్ ధర లీటర్ రూ.97.13 లుగా ఉంది. అదే కర్ణాటక విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 101.34 లుగా, లీటర్ డీజిల్ ధర రూ. 85.49 లుగా ఉంది. ఈ లెక్కన మన రాష్ట్రంలో కంటే కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 9.77 లు, లీటర్ డీజిల్ ధర రూ. 11.64 లు తక్కువగా ఉంది.


Also Read:  10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం... తిరుమలలో మూడో ఘాట్ రోడ్డు... టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం


ఒకటి, రెండు కిలోమీటర్లు దాటితే పెట్రోల్, డీజిల్ రేటు రూ. పది తగ్గుతూండటంతో అందరూ కర్ణాటకకే వెళ్తున్నారు.  ఆటోవాలాలు, ట్రాక్టర్ల కోసం రైతులు, ద్విచక్ర వాహనదారులు ఇలా ప్రతి ఒక్కరూ తక్కువ ధరకు పెట్రోల్ డీజిల్ ఇస్తున్న కర్ణాటక బంకులకు క్యూకడుతున్నారు. ఈ కారణంగా చిలమత్తూరు మండలం లో ఉన్న పెట్రోల్ బంకులు వ్యాపారాలను కోల్పోయాయి. ఉన్న తొమ్మిది బంకుల్లో ఏకంగా 5 బంకులు మూతపడ్డాయి. మూతబడిన బంకులు 44వ జాతీయ రహదారిపై ఉండడం వలన ఎవరికైనా అత్యవసరంగా డీజిల్ , పెట్రోల్ అవసరం అయితే  కర్ణాటకకు పరుగులు తీయాల్సిన పరిస్థితి  నెలకొంది.


Also Read: జగన్ హామీ నెరవేరలేదు.. పైగా జైలు పాలయింది..! టీటీడీ పారిశుద్ధ్య కార్మికులు రాధ దీన స్థితి...


గతంలోనూ కర్ణాటకతో పోలిస్తే ఏపీలో రేట్లు ఎక్కువగానే ఉండేవి. కానీ ఆ తేడా మరీ ఎక్కువగా ఉండేది కాదు. రెండు, మూడు రూపాయల్లో ఉండేది. కానీ కేంద్రం పిలుపు మేరకు కర్ణాటక ప్రభుత్వం వ్యాట్ తగ్గించడంతో తేడా పెరిగిపోయింది. ఏపీ ప్రభుత్వం కూడా రేట్లు తగ్గిస్తే తప్ప.. మళ్లీ బోర్డర్‌లోని పెట్రోల్ బంకుల వైపు జనం చూసే అవకాశం లేదు. పన్నులు తగ్గించకూడదన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల బోర్డర్‌లోని ఇతర రాష్ట్రాల పెట్రోల్ బంకులకు  భారీగా వ్యాపారం పెరిగింది. 


Also Read: ఏపీ హైకోర్టు సీజేకు ఎంపీ రఘురామ లేఖ... జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం... సుమోటోగా విచారణ చేయాలని వినతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి