తెలంగాణకు చెందిన ఆరుగురు అథ్లెట్లకు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌లో(టాప్స్) స్థానం దక్కింది. 2024 పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు ఎ.శ్రీజ, ఎస్.ఫిడెన్ ఆర్.స్నేహిత్, షూటర్లు ఇషా సింగ్, ధనుష్ శ్రీకాంత్, కినాన్ చెనాయ్, వెయిట్ లిఫ్టర్లు కేవీఎల్ పావని కుమారిలు ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.
కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో రూపొందిన యువజన వ్యవహారాల, క్రీడల శాఖకు చెందిన మిషన్ ఒలింపిక్ సెల్‌లో వీరితో సహా మరో 20 మందిని చేర్చారు. దీంతో ఈ పథకంలో ఉన్న మొత్తం అథ్లెట్ల సంఖ్య 148కి చేరింది.
ఇటీవలే జరిగిన నేషనల్స్‌లో ఆరు మెడల్స్ సాధించి షూటర్ ఇషా సింగ్ మంచి ఫాంలో ఉంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో శ్రీకాంత్ కూడా ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడు. చెనాయ్ ఎప్పట్నుంచో గేమ్ ఆడుతున్న షూటర్.
ప్యాడ్లర్లు శ్రీజ, స్నేహిత్ కూడా నేషనల్, ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో నిలకడగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఇక లిఫ్టర్ పావని కుమార్ హైదరాబాద్‌లోని హకీంపేటలో ఉన్న తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థిని.
టాప్స్ ద్వారా వీరికి ఆర్థిక సాయంతో పాటు మంచి శిక్షణ కూడా అందిస్తారు. సైక్లింగ్, సెయిలింగ్, షూటింగ్, స్విమ్నింగ్, రెజ్లింగ్ వంటి క్రీడల నుంచి టాప్స్ జాబితాలో స్థానం పొందారు. దీంతోపాటు ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, జూడో, రోయింగ్, టెన్నిస్ క్రీడాకారులను త్వరలో ఈ జాబితాలో చేర్చనున్నారు.
Also Read: Ganguly on IPL 2022:: ఒమిక్రాన్‌పై గంగూలీ కామెంట్స్..! వచ్చే ఐపీఎల్‌ను...?
Also Read: Rohit Sharma Update: బయటి మాటల్ని పట్టించుకోం.. బలమైన బంధమే ముఖ్యమన్న రోహిత్
Also Read: India's Tour Of South Africa: ఈ నలుగురూ ఆడితే దక్షిణాఫ్రికా టూర్‌లో భారత్‌కు తిరుగులేదు.. ఎవరంటే?
Also Read: Pushpa Event: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?