ఒప్పందం ప్రకారం ఇళ్లు కట్టించి ఇవ్వనందుకు.. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు రూ. 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సీఆర్డీఏకు అమరావతి హ్యాపీనెస్ట్ ( Happy Nest ) కొనుగోలు దారులు లీగల్ నోటీసులు పంపారు. సీఆర్డీఏ స్పందనను బట్టి సీఆర్డీఏపై ‘రేరా’ ( Rera Act ) చట్టం కింద కేసు వేస్తామనిహ టున్న కొనుగోలుదారులు స్పష్టం చేశారు. హ్యాపీ నెస్ట్ అనేది అమరావతిలో సీఆర్డీఏ చేపట్టిన ప్రాజెక్ట్. రాజధానిలో ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారి కోసం ప్రత్యేకంగా అపార్టుమెంట్ల ( Happynest Apartments ) సముదాయాన్ని నిర్మించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. అందుబాటు ధరల్లో 12 టవర్స్, 1200 ప్లాట్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బుకింగ్స్ ప్రారంభించిన గంటలోనే అన్ని ఫ్లాట్స్ అమ్మకాలు పూర్తయ్యాయి. కొనుగోలు చేసిన వారు పది శాతం డబ్బులు కట్టేశారు. ఒప్పందం ప్రకారం వారికి గత ఏడాది డిసెంబర్ నాటికి ఫ్లాట్స్ హ్యాండోవర్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు పునాదుల్లో కూడా ఆ ప్రాజెక్టు లేదు.
మూడు రాజధానుల అంశం సరికాదు : కేంద్రమంత్రి అథవాలే
హ్యాపీ నెస్ట్ కోసం నేలపాడులో ( Nelapadu ) స్థల సేకరణ చేశారు. 18 అంతస్థుల నిర్మాణాలతో 12టవర్లు నిర్మించటానికి టెండర్లు పిలిచారు. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కంపెనీగా సీబీఆర్‌ఈని నియమించారు. కాంట్రాక్ట్‌ను షాపూర్జీపల్లోంజీ సంస్థ పొందింది. ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లను అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. అన్నివర్గాలకు అనువుగా ఎంఐజీ, హెచ్‌ఐజీలకు అవకాశం కల్పించింది. టెండర్లలో ఎస్‌పీసీఎల్ సంస్థ ప్రాజెక్టు పనులను దక్కించుకుంది. సన్నాహాలు పూర్తిచేసుకుని హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు శ్రీకారం చుట్టుకుంటుందనగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదు. 1200 ఫ్లాట్లకు దాదాపు రూ. 90 కోట్ల మేర కొనుగోలు దారులు అడ్వాన్స్ చెల్లించారు.
అమరావతిలో కేంద్ర సంస్థల నిర్మాణాలు షురూ.. ఢిల్లీ నుంచి ఇవే సిగ్నల్సా ?
అడ్వాన్స్ కట్టిన వారితో సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పంద ప్రకారం ఇళ్లను ఇవ్వలేకపోయింది. దీంతో ఇప్పుడు వారంతా కోర్టును నష్టపరిహారం కోసం ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. 2020లో పనులు ముందుకు సాగకపోవడంతో న్యాయపోరాటానికి వెళతామని కొనుగోలుదారుల హెచ్చరించారు. ఆ సమయంలో ప్రభుత్వం రివర్స్ టెండర్లకు వెళ్లింది. అయితే టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఒప్పందం ప్రకారం గడువు తీరిపోవడంతో ముందస్తుగా చెల్లించిన 10% సొమ్ము, 14% వడ్డీతో చెల్లించాలని చెల్లించాలని.. నష్టపరిహారం కింద రూ.20 లక్షలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీఆర్డీఏ స్పందించకపోతే కోర్టులో పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి.