Kodali Nani On Jr NTR : మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకుంటారని, చంద్రబాబు మరో పార్టీ పెట్టుకుంటారని జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో బీజేపీ,టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్నారు.  2024 ఎన్నికల్లో ఎన్టీఆర్ బీజేపీ పార్టీ కలిసి పోటీ చేస్తాయన్నారు.  చంద్రబాబు కొత్త పార్టీ జనసేన కలిసి పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోతారన్నారు.  


టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ కు 


జూనియర్ ఎన్టీఆర్‌ టీడీపీని స్వాధీనం చేసుకుంటారని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. కొడాలి నాని అడిగారనో, లక్ష్మీపార్వతి చెప్పారనో జూ.ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకోరన్నారు. టైం వచ్చినప్పుడు ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడతారన్నారు.  2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేస్తాయన్నారు. టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌  తీసుకోవడంతో చంద్రబాబు కొత్త పార్టీ పెట్టుకొని జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కు లాస్ట్ ఎన్నికలన్నారు. ఇద్దరికీ డిపాజిట్లు కూడా రావన్నారు. 2024 ఎన్నికల్లో  చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పీడ విరగడవుతుందన్నారు.  



అమిత్ షా-ఎన్టీఆర్ భేటీపై 


వైసీపీ ఎప్పుడూ సింగిల్ గానే పోటీ చేస్తుందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.  అయితే బీజేపీ, టీడీపీ కలిసి పోటీచేస్తాయని,  మరోవైపు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కూటమని వైసీపీ ఓడిస్తుందన్నారు. 2024 ఎన్నికలే ఆ పార్టీలకు చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జూనియర్ ఎన్టీఆర్ ను నోవాటెల్‌ హోటల్‌లో కలిశారు. అమిత్ షా, ఎన్టీఆర్‌ భేటీపై తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.  ఈ భేటీపై కొడాలి నాని ఇప్పటికే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉపయోగం లేకుంటే ఎవరితోనూ నిమిషం కూడా మాట్లాడరన్నారు. బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అయ్యారన్నారు.  ఎన్టీఆర్ పాన్‌ ఇండియా స్టార్‌ కాబట్టి ఆయన సేవలను ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు చూస్తున్నారన్నారు. 


టీడీపీ, జనసేన, బీజేపీ కకావికలం 


గుడివాడలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్తూ ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు.  కొడాలి నాని మాట్లాడుతూ కుప్పంకే పరిమితమైన చంద్రబాబు ఇతర జిల్లాల కార్యకర్తలను పిలిపించుకుని దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గంలో చంద్రబాబుపై వ్యతిరేక మొదలైందన్నారు. చంద్రబాబు ఆఖరికి కుప్పంలో పోరాడాల్సి వస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమితో రాష్ట్రంతో పాటు, కుప్పంలో సైతం చంద్రబాబు పీడ విరగడవుతుందన్నారు. కుప్పంలో అడ్రస్‌, ఓటర్‌ కార్డులేని చంద్రబాబు సీఎం జగన్‌ ను ఏవిధంగా సవాల్‌ విసురుతారన్నారు. సీఎం జగన్‌ దెబ్బకు టీడీపీ, జనసేన, బీజేపీ వచ్చే ఎన్నికల్లో కకావికలం అవుతాయన్నారు.  


Also Read : Sajjala On Chandrababu : కుప్పంలో చంద్రబాబు డ్రామా, 2014లోనే అన్న క్యాంటీన్లు ఎందుకు పెట్టలేదు- సజ్జల


Also Read : AP News : ఢిల్లీలో బుగ్గన సహా 10 మంది ముఖ్య కార్యదర్శులు - ఏపీ అప్పులపై ఢిల్లీలో హైలెవల్ మీటింగ్ !