తెలంగాణలో టీఎస్‌ఎస్పీడీసీఎల్ నిర్వహించిన జూనియర్ లైన్‌మెన్ పరీక్షను రద్దు చేసింది ప్రభుత్వం. వెయ్యి పోస్టుల భర్తీకి జులై 17 పరీక్ష పేపర్ లీకైందని వెలుగులోకి వచ్చింది. 181 మంది అభ్యర్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినట్టు విచారణలో తెలింది. దీంతో పరీక్ష రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఘట్‌కేసర్ పరీక్ష కేంద్రంలో ఓ అభ్యర్థి సెల్‌ఫోన్ తెచ్చుకొని ఎగ్జామ్ రాస్తూ పట్టబడ్డాడు. అతన్ని విచారిస్తే అసలు సంగతులు వెలుగు చూశాయి. అదే టైంలో అంబర్ పేట పోలీసు స్టేషన్‌తో జూనియర్ లైన్‌మెన్ పరీక్ష రాసిన అభ్యర్థి కేసు పెట్టాడు. కొంతమంది ఉద్యోగులు పరీక్ష పేపర్ అందిస్తామని డబ్బులు తీసుకున్నట్టు అందులో పేర్కొన్నాడు. ఈ రెండు ఫిర్యాదులపై రాచకొండ పోలీసులు విచారిస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
టీఎస్‌గఎస్పీడీసీఎల్ నిర్వహించిన జూనియర్‌లైన్‌మెన్ పరీక్ష అక్రమాల్లో ఇంటి దొంగల బండారం బయటపడింది. ఇద్దరు ఏడీఈలు సహా ఐదురుగు ఉదోగుల పాత్ర వెలుగులోకి వచ్చింది. వారిని అరెస్టు చేసిన పోలీసులు మరిన్ని వాస్తవాలు వెలికి తీశారు. దీంతో ఆ ఉద్యోగాలను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. శాఖాపరమైన చర్యలు ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో వివిధ ప్రాంతాల్లోని అభ్యర్థులతో సమాధానాలు చెప్పేందుకు ఈ ముఠా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తేలింది. వారిలో ఇప్పటికి 181 మంది మాత్రమే వెలుగులోకి వచ్చారు. ఇంకా చాలా మంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అందుకే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.
ఈ లీకులపై స్పందించిన టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమారెడ్డి స్పందిస్తూ... మాల్ ప్రాక్టీస్ జరిగినందున గతంలో నిర్వహించిన జూనియర్ లైన్‌మెన్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ప్రకటిస్తామన్నారు.