ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ( AP Governer ) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ( PM Modi ) సమావేశం అవుతారు. అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోనూ ( President Kovind ) భేటీ అవుతారు. ప్రత్యేకంగా ఏదైనా అంశంపై నివేదికలు సమర్పించానికా లేకపోతే.. మర్యాదపూర్వకంగా కలుస్తున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఢిల్లీలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ చేసిన పూర్తి అప్పుల వివరాలు ఇవ్వాలని కేంద్రం అడుగుతోంది. ఈ లెక్కలు ఇచ్చిన తర్వాతనే కొత్త అప్పులకు అనుమతులు ఇస్తామని కేంద్రం అంటోంది. అదే సమయంలో నేరుగా గవర్నర్‌నే హామీదారునిగా పెట్టి రూ. పాతిక వేల కోట్ల వరకూ అప్పు చేసిన వివాదాస్పదం అయింది.
రేషన్ బియ్యానికి నగదు బదిలీ వాయిదా - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం !
స్టేట్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ ( AP SDC ) పేరు మీద తీసుకున్న అప్పునకు హామీదారుగా గవర్నర్‌ను పెట్టారు. ఈ అంశంపై న్యాయ స్థానాలతో పాటు కేంద్రం కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా పూర్తి వివరాలు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపలేదని చెబుతున్నారు. గవర్నర్ ( Governer ) కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని వివరణ కోకారు. ఏపీ ప్రభుత్వం వివరణపై గవర్నర్ స్పందనేమిటో స్పష్టత లేదు. రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్ ప్రధానమంత్రి, రాష్ట్రపతికి నివేదిక సమర్పించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయం పరిస్థితులతో పాటు ఆర్థిక పరిస్థితులపైనా నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.
ఒక్క రోగీ హాజరుకానీ భారీ హెల్త్ క్యాంప్ - కానీ డిప్యూటీ సీఎం,ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రారంభించారండోయ్ !
సోమవారం వరకూ గవర్నర్ ఢిల్లీలోనే ( Delhi ) ఉంటారు. పలు ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఏపీ గవర్నర్ అధికారిక పనుల మీద ఢిల్లీ వెళ్లడం అరుదుగానే ఉంటుంది. సమావేశాలు ఉన్నప్పుడు లేకపోతే.. ప్రత్యేకంగా హోంశాఖ నుంచి పిలుపు వచ్చినప్పుడు మాత్రమే వెళ్తారు. తెలంగాణ గవర్నర్ ( Telangana Governer ) ఢిల్లీ పర్యటనల తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏపీ గవర్నర్ పర్యటన కూడా చర్చనీయాంశం అవుతోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌తో పోరాటం చేస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ కారణంగా ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు ఉండవని అంచనా వేస్తున్నారు.