గొప్ప ఏర్పాట్లు చేశారు. ఇరవై మూడు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇరవై రకాల హెల్త్ టెస్ట్‌ల కోసం ఏర్పాట్లు చేశారు. గొప్పగా డెకరేషన్ చేశారు. ఫ్లెక్సీలు వేశారు. అందరూ వచ్చారు. గొప్ప ప్రారంభోత్సవం చేశారు. కానీ అసలు రావాల్సిన వాళ్లు ఒక్కళ్లూ రాలేదు. వాళ్లు టెస్టులు చేయించుకునేవాళ్లు. ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. ఈ ఘటన జరిగింది తిరుపతిలో.
తిరుపతిలో ఆయుష్మాన్ భారత్-ఆరోగ్య మేళ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. భారీగా ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేశారు. 23 స్టాల్స్ లో 23 రకాల వ్యాధులు పరీక్షలు చేసుకునేలా ఏర్పాటు చేశారు. కానీ పరీక్షలు చేయించుకోవడానికి ఒక్క రోగి కూడా రాలేదు. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందంటూ అధికార పార్టీ నేతలు ఆరోగ్య శాఖ అధికారులపై మండిపడ్డారు.
ఏ సైకో కళ్లల్లో ఆనందం కోసం వేధించారు?- ఎవరినీ వదిలి పెట్టబోనన్న ఏబీవీ
శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని లలిత కళాప్రాంగణంలో ఆయుష్మన్ భారత్-ఆరోగ్య మేళ కార్యక్రమంను డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిలు ప్రారంభించారు. పరీక్షలు చేయించుకునేందుకు ఒక్క రోగీ హాజరు కాకపోయినా ప్రారంభోత్సవం మాత్రం ఘనంగా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్నాని కానీ ఆరోగ్య శాఖ అధికారులు అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించడం దారుణం అన్నారు. ఆయుష్మన్ భారత్ - ఆరోగ్య మేళా ఏర్పాట్లుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 23 స్టాల్స్ ఏర్పాటు చేసి అందులో ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకునేందుకు ఒక్క రోగి కూడా లేక పోవడంతో నేతలు హెల్త్ అధికారులపై ఊగిపోయారు.
నన్ను సిగ్గులేదా అన్నారు! బాబు ఇచ్చే ట్రైనింగ్ ఇదేనా? క్షమాపణకు వాసిరెడ్డి పద్మ డిమాండ్
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తారా అంటూ ఆగ్రహించారు.. ఇకనైనా అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.. మరోసారి పెద్ద స్థాయిలో ప్రజలు ఎక్కువగా పరీక్షలు చేసుకునే విధంగా హెల్త్ మేళాలను నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అధికార పార్టీ నేతలను మెప్పించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు కానీ అక్కడ ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారనే సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఎవరికి టెస్టులు చేస్తారో.. ఎవరు అర్హులో అర్థం కాని పరిస్థితి. దీంతో ప్రజలు అందరూ దూరంగానే ఉండిపోయారు. చివరికి హెల్త్ మేళా టెస్టులు లేకుండానే ముగిసింది.