East Godavari News : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో బిక్కవోలు గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో వైఎస్సార్ చేయూత కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం కోసం వేసిన టెంట్ల తాళ్లను నిర్వాహకులు శివలింగానికి కట్టడం వివాదాస్పదం అయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భక్తులు నిర్వాహకులు తీరుపై మండిపడుతున్నారు.
అసలేం జరిగింది?
అనపర్తి మండలం బిక్కవోలు గ్రామంలో మూడో విడత చేయూత పథకం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, వైసీపీ నాయకులు, అధికారులు హాజరు అయ్యారు. భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసిన స్థానిక నాయకులు టెంట్ తాళ్లను తూర్పు చాణుక్యల కాలానికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని శివలింగానికి కట్టడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోను కొందరు సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేశారు. ఆ వీడియో వైరల్ గా మారడంతో స్థానికులు, గ్రామస్తులు వైసీపీ నాయకుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ ఘటనపై అనపర్తి నియోజకవర్గం వైసీపీ నాయకులు, బహిరంగ సభ ఏర్పాటు చేసిన నాయకులు, కనీసం స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతిపూరతనమైన ఆలయంలో శివలింగానికి టెంట్ తాళ్లు కట్టడంపై మండిపడుతున్నారు.
వైసీపీ ఓ పేర్ల పిచ్చి పార్టీ, దోచుకున్నది చాలు దోపిడీ ఆపండి: సత్యకుమార్
మండిపడుతున్న భక్తులు
ప్రసిద్ధ ఆలయంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడమే తప్పని, పైగా భక్తుల మనోభావాలను కించ పరిచే విధంగా శివలింగానికి టెంట్ తాళ్లు కట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన సభ బ్రహ్మాండంగా నిర్వహించారు కానీ సభ పేరుతో శివలింగానికి షామియానా తాళ్లు కట్టడం సరికాదన్నారు. సభ పేరుతో శివలింగానికి అపచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షామియానా తాళ్లు కట్టడానికి సమీపంలోని కర్రలు ఏవైనా ఉపయోగించాలి గానీ ఇలా శివలింగానికి తాళ్లు కట్టడమేంటని భక్తులు మండిపడుతున్నారు. ఈ గోలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని, భారతదేశంలో కుమార సుబ్రమణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు రెండు చోట్ల మాత్రమే ఉన్నాయని భక్తులు అంటున్నారు. ఒకటి దక్షిణ దేశంలోని ఫలణిలో అయితే రెండోది బిరుదాంకపురంలో ఉంది. మరి బిక్కవోలు ఆలయంలో జరిగిన అపచారానికి అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.
Also Read : Ysrcp Internal Politics : నంద్యాల వైసీపీలో వర్గ విభేదాలు, సీఎం వద్దే పంచాయితీ తేల్చుకుందామని సవాల్!
Also Read : Botsa Satyanarayana: 3 రాజధానులు చేస్తే తప్పేంటి? అదే జరిగితే నేను మంత్రిగా అనర్హుడ్ని - బొత్స