జగన్ కు చంద్రబాబు హాని తలపెడతారని.. రోజూ భయపడుతున్నట్టు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. కొడాలి నాని, అంబటి, వంశీపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ హత్యకు కుట్ర జరుగుతోందని.. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నేతల దీనికోసం ప్లాన్ వేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రకాశ్ రెడ్డి చేసిన కామెంట్స్.. సంచలనంగా మారాయి. జగన్ హత్య చేసైనా.. అధికారంలోకి రావాలని చూస్తున్నారని.. తీవ్రస్థాయిలో ప్రకాశ్ రెడ్డి కామెంట్స్ చేశారు.


అయితే దీనిపై ఓ వైపు చర్చ నడుస్తుంటేనే.. మరోవైపు.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా.. ఇదే తరహా కామెంట్స్ చేశారు. 
చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి డిప్యూటీ సీఎం హాజరయ్యారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు.. అమల చేస్తున్న ముఖ్యమంత్రిపై అవమానకరంగా మాట్లాడుతున్నారని నారాయణ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది సమావేశం పెట్టారని తెలిపారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబును చంపుతామని బెరించారని తెలిపారు. అంతేగాకుండా వారిని హతమార్చేందుకు చందాలు కూడా పోగుచేస్తున్నారని  ఆరోపించారు. 


జగన్ పై కుట్ర జరుగుతోందని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు.. హాని తలపెడతారేమోననే భయం రోజూ ఉంటుందని అన్నారు. అంతేగాకుండా.. కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీని చంపేందుకు చంద్రబాబు సామాజికవర్గం చందాలు పోగు చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యాలపై మాట్లాడారు. ముఖ్యమంత్రి గాల్లో కలిసిపోతాడని టీడీపీ అధినేత.. చెప్పిన మాటాలను గుర్తు చేశారు.


Also Read: Sai Teja Funerals: జనం మనసుల్లో జవాన్ సాయితేజ.. సెల్యూట్ సైనికా.. సెలవిక


Also Read: Chandrababu: ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయి... తిక్కారెడ్డిపై దాడి ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ


Also Read: Instagram: చోరుడి కొంపముంచిన ఇన్ స్టా గ్రామ్.. దారి దోపిడీ చేసి దొరకనులే అనుకున్నాడు.. కానీ..


Also Read: Corona Update: ఏపీలో కొత్తగా 160 మంది మృతి.. వైరస్ కారణంగా ఒకరు మృతి


Also Read: Pawan Kalyan: ఏపీకి వైసీపీ హానికరం... లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రాన్ని ప్రైవేటీకరణ చేస్తారా.... ఉక్కు దీక్షలో పవన్


Also Read: జగనన్న ఉన్నాడు జాగ్రత్త... గుంతల రోడ్డుపై ఫ్లెక్సీ... వైరల్ అవుతున్న వీడియో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి