హైదరాబాద్ కు చెందిన నామాల సతీశ్.., అతడి తండ్రి రామకృష్ణారావు నవంబర్ 18న గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరికి వచ్చారు. సతీశ్ మేనత్త ఇంట్లో కార్తీకవ్రతం ఉంటే హాజరయ్యారు. హైదరాబాద్ వెళ్లాల్సిన పని ఉండటంతో.. అదే రోజు.. స్కూటీపై రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. తక్కెళ్లపాడు మానస సరోవరం దగ్గరలో స్పీడ్ బ్రేకర్లు దాడుతుండంగా.. వెనక నుంచి వచ్చిన యర్రంశెట్టి శివకోటేశ్వరరావు, షేక్ షరీఫ్... తమ బైక్ తో స్కూటీని ఢీ కొట్టారు. 


వెనక నుంచి వచ్చి ఆకస్మాత్తుగా ఢీ కొట్టడంతో సతీష్, అతడి తండ్రి కింద పడిపోయారు. వారి దగ్గర ఉన్న 4000 రూపాయలు, సెల్ ఫోన్ లాక్కుని వెళ్లిపోయారు. అయితే ఈ ఘటన జరుగుతున్న టైమ్ లో సతీశ్ బైక్ నంబర్ ను గుర్తుపెట్టుకున్నాడు. అంతేకాదు.. నిందితులను పరిశీలించాడు. అయితే సతీశ్ విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి.. కేసులు.. ఇవన్నీ ఎందుకని.. సైలెంట్ గా ఉండిపోయాడు.


సతీశ్ కు ఇన్ స్టా గ్రామ్ చూడటం అలవాటు ఉండేది. నిందితుడిని ఇన్ స్టా గ్రామ్ లో గుర్తించాడు. ఈ విషయాన్ని తండికి చెప్పాడు. అవును ఆ రోజు దోచుకున్నది ఇతడేనని నిర్ధారించుకున్నారు. ఈనెల 10వ తేదీన పెదకాకాని పోలీసుస్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘటనను వివరించారు.
సతీష్‌ ఇచ్చిన సమాచారంతో టెక్నాలజీ ఉపయోగించి.. గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన నిందితుడు యర్రంశెట్టి శివకోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు షరీఫ్‌ పరారీలో ఉన్నాడు. హైవేలపై చోరీలు చేస్తున్న నిందితుడు శివకోటేశ్వరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని..సీఐ బి సురేష్‌బాబు తెలిపారు. ఈ కేసును చేధించడంలో సహకరించిన హెడ్‌కానిస్టేబుల్‌ రాజేంద్ర, కానిస్టేబుళ్లు టి శ్యాంసన్, యానాదిలను అభినందించారు.


Also Read: Chandrababu: ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయి... తిక్కారెడ్డిపై దాడి ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ


Also Read: Medchal: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి.. మద్యం మత్తే కొంపముంచింది


Also Read: Hyderabad: సెలైన్ బాటిల్‌లో విషం ఎక్కించిన డాక్టర్.. దాన్ని తన చేతికే పెట్టుకొని..


Also Read: Tamil Nadu: కెమికల్స్ పరిశ్రమలో క్లోరిన్ గ్యాస్ లీక్... యజమాని మృతి, 13 మంది కార్మికులకు అస్వస్థత


Also Read: ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయి... తిక్కారెడ్డిపై దాడి ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి