ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఆందోళనలు అన్నీ రాజకీయ ప్రేరేపితంగానే జరుగుతున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కమ్యూనిస్టులతో కలిసి తెలుగుదేశం పార్టీ  రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శఇంచారు. "చేదోడు" పథకం  రెండో ఏడాది నగదు విడుదల కార్యక్రమంలో మాట్లాడిన సీఎం జగన్‌.. విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ అనుకోరని వారితో తాము సమ్మె విరమింపచేయగానే చంద్రబాబు కమ్యూనిస్టు పార్టీలను ముందుకు తోశారని ఆరోపించారు. ఎర్రజెండా వెనుక పచ్చజెండా ఉందన్నారు.


మేం 1.84 లక్షల ఉద్యోగాలిచ్చాం.. ‘జగనన్న చేదోడు’ నిధుల విడుదల సందర్భంగా సీఎం వెల్లడి


చంద్రబాబు సీఎంకాలేదని బాధపడేవాళ్లే ఆందోళనలు కోరుకుంటారని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళనలు కోరుకుంటున్నారని విమర్శించారు. కేవలం ప్రభుత్వం పైకి రెచ్చగొట్టాలని టీచర్లను రోడ్డెక్కిస్తే పిల్లల భవిష్యత్ ఏమిటని జగన్ ప్రశ్నించారు . కొన్ని మీడియా సంస్థలపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఈనాడు, ఆందోళనలకు పెద్ద ఎత్తున ఇచ్చి  రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. విపక్షాలతో చేతులు కలిపి రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట ఆందోళనలు చేయండి కవరేజీ ఇస్తామని మాట్లాడుకుంటున్నారని జగన్ ఆరోపించారు. ఆశావర్కర్ల ఆందోళనలు.. నిరుద్యోగుల ధర్నాలు.. టీచర్ల నిరసనలు అన్నీ ప్రతిపక్షాలు చేయిస్తున్నవేనన్నారు. 


నెల్లూరు పోలీసు యూనిఫామ్ ఘటనలో ట్విస్ట్! అక్కడికి పురుషులు వచ్చింది అందుకే..: పోలీసులు


 కరోనా కారణంగా మూడేళ్లపాటు విద్యా వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ..   పిలల్లకు పరీక్షలు కూడా నిర్వహించలేకపోయామన్నారు. బాధ్యతగా వ్యవహించాల్సిన ఉపాధ్యాయులు రాజకీయ పార్టీల  ప్రయోజనాలు కాపాడాలని ఆందోళలను చేయడం ఆవేదన కలిగిస్తోంద్నారు.  ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేశామని.. అదే పక్క రాష్ట్రం తెలంగాణలో తమను కూడా విలీనం చేయాలని ఆందోళనలు చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోలేదని గుర్తు చేశారు. 


ఛలో విజయవాడ స్ఫూర్తితో ఈ నెల 10న ఛలో కలెక్టరేట్‌కు విద్యార్థి సంఘాల పిలుపు


ప్రస్తుతం ఏపీలో ఉద్యోగులంతా హ్యాపీగా ఉన్నారని జగన్ స్పష్టం చేశారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఉద్యోగస్తులకు మంచి చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చేస్తుంటే తప్పుడు ప్రచారాలు చేసి లబ్ధి పొందాలని చూడడం దారుణమన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని  ఆరోపించారు. " మా బాబు పాలనే బాగుంది " అనే అజెండాతో  ఇలాంటి ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి జగన్ ఆరోపించారు.