పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఫిట్‌మెంట్‌ను సోమవారం ప్రకటిస్తారని ఆశపడుతున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ముఖ్యమంత్రి జగన్‌తో మంగళవారం ఉద్యోగసంఘాల భేటీ ఉందని ఆ తర్వాత ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సోమవారం పీఆర్సీకి సంబంధించి కొన్ని కీలకమైన పరిమామాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు చేశారు.  ముఖ్యమంత్రి వద్ద పీఆర్సీ  అంశంపై అధికారుల సమావేశం జరిగిందిృని... కార్యదర్శుల కమిటీ నివేదికను ఆయనకు ఇచ్చారని తెలిపారు. మంగళవారం ఉద్యోగసంఘాలతో భేటీ తర్వాత సీఎం ప్రకటన చేస్తారని ఆయన తెలిపారు. 


Also Read: తిట్ల నుంచి హత్య కుట్ర ఆరోపణల వరకూ ఏపీ రాజకీయాలు ! రాజకీయం అంటే అదేనా ? నేతలకు నైతికతే ఉండదా?


ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం ఉద్యమబాటలో ఉన్నాయి. ఈ నెల మూడో తేదీన తిరుపతిలో వరద బాధితులను పరామర్శిస్తున్న సమయంలో తన వద్దకు వచ్చిన ఉద్యోగసంఘ నేతలకు సీఎం జగన్ ప్రత్యేకంగా హామీ ఇచ్చారు. వారం,పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామన్నారు. పీఆర్సీకి సంబంధించి కసరత్తు పూర్తయిందని తెలిపారు. సీఎం ప్రకటన చేసిన తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ కూడా నిర్వహించారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు తమకు పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నిస్తున్నారు .


Also Read: ఏపీ హైకోర్టుకు అదనపు భవనం.. భూమి పూజ చేసిన చీఫ్ జస్టిస్ !


సంప్రదాయంగా ప్రభుత్వం పీఆర్సీ నివేదికను ముందుగా ఉద్యోగులకు ఇస్తుంది. వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకుని ఫైనల్‌గా ఫిట్‌మెంట్, ప్రయోజనాలు కల్పించే విధివిధానాలు ప్రకటిస్తారు. అయితే ఉద్యోగులకు ఇంత వరకూ పీఆర్సీ నివేదిక ఇవ్వలేదు. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాలన్నింటికీ సమాచారం ఇవ్వలేదు. రెండు ఉద్యోగసంఘాల నేతలకు మాత్రమే సమాచారం ఇచ్చినట్లుగాచెబుతున్నారు. దీంతో ఆందోళన బాట పట్టిన ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలకు ఆహ్వానం ఉంటుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. 


Also Read: జగనన్న ఉన్నాడు జాగ్రత్త... గుంతల రోడ్డుపై ఫ్లెక్సీ... వైరల్ అవుతున్న వీడియో


నిజానికి పీఆర్సీ ప్రకటించినంత మాత్రాన తమ నిరసనలు..ఆందోళనలు ఆపలేమని..  ఉద్యోగసంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. తమకు మరో 70 డిమాండ్లు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా సీపీఎస్ రద్దు అంశాన్ని ఉద్యోగసంఘాలు మరింత సీరియస్‌గా తీసుకున్నాయి. దీంతో  ఫిట్‌మెంట్‌ను ఎంత ప్రకటిస్తారు? ఉద్యోగుల స్పందన ఎలా ఉంటుంది.. ? మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ? అన్న అంశాలపై ఉత్కంఠ  ప్రారంభమయింది.


Also Read:  ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయి... తిక్కారెడ్డిపై దాడి ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి