చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిటర్ల సొమ్ము గల్లంతైంది. సుమారు మూడు కోట్ల రూపాయల పైగా నగదు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. పొదుపు సంఘాలు, వ్యక్తిగత ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్ము కాజేసినట్లు సమాచారం. 15 ఏళ్లుగా తాత్కాలిక మెసెంజర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి కొందరు బ్యాంకు ఉద్యోగుల సహకారంతో భార్య ఖాతాలోకి నగదు బదిలీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. పొదుపు సంఘాల మహిళలు తమ ఖాతాల్లోని డబ్బు మాయమైందని తెలియడంతో కలికిరి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. డ్వాక్రా మహిళా సంఘాలకు చెందిన సొమ్ము కోట్లలో స్వాహా అయినట్లు వెలుగు అధికారులు గుర్తించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వెలుగు సిబ్బంది కోరుతున్నారు. 


మేనేజర్, ఉద్యోగులు బదిలీ


చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచ్‌లో రూ.3 కోట్ల సొమ్మును తాత్కాలిక ఉద్యోగి తన భార్య ఖాతాల్లోకి మళ్లించాడు. దాదాపు 150 డ్వాక్రా సంఘాలకు చెందిన పొదుపు ఖాతాల నుంచి కోటిన్నర వరకు మాయమయ్యింది. కొందరి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా వేరే ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలుస్తోంది. మహిళా సంఘాల ఖాతాల్లో బ్యాంకు సిబ్బంది పెద్ద మొత్తంలో సొమ్మును వేరే ఖాతాల్లోకి మళ్లించారని దీనిపై విచారణ జరిపించాలని వెలుగు అధికారులు డీఆర్‌డీఏ పీడీని కోరారు.  ఈ విషయం బయటకు రాగానే బ్యాంకు ఉన్నతాధికారులు గుట్టుచప్పుడు కాకుండా విచారణ జరిపి మేనేజర్ తో పాటు కొంత మంది ఉద్యోగులను బదిలీచేశారు.


ఇవ్వని రుణం ఇచ్చినట్లు


బ్యాంకులో తాత్కాలిక మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్న అబ్దుల్‌ అలీఖాన్‌ తన భార్య పేరుతో భారీ మొత్తంలో నగదు బదిలీ చేసినట్లు వెల్లడైంది. సేవింగ్ , ఫిక్స్​డ్​ డిపాజిట్లలోని సొమ్మును ఖాతాదారులకు తెలియకుండా వేరే ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేసేశారు. ఖాతా లావాదేవీలు ఖాతాదారులకు  మేసేజ్​వెళ్లకుండా బ్లాక్ చేశారు. నెట్​వర్క్ పనిచేయలేదని, ప్రింటర్లు పని చేయలేదని చెప్తూ పాస్ పుస్తకాలు ఎంట్రీ ఇవ్వలేడడంలేదని బాధితులు చెప్పారు. దీంతో ఈ మోసాలను ఖాతాదారులు గుర్తించలేకపోయారు. ఓ వెలుగు సంఘానికి ఇవ్వని రూ.10 లక్షల రుణాన్ని ఇచ్చినట్లు చెప్పడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.


ఫోర్జరీ సంతకాలతో  


ఈ వ్యవహారంపై బ్యాంకు ఉన్నతాధికారులు రహస్యంగా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. మాయమైన నగదును త్వరలో ఖాతాలలో జమ చేస్తామని బ్యాంకు అధికారులు ఖాతాదారులకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాంకు సిబ్బందిపై అనుమానంతో వెలుగు సంఘాలు పోలీసులను ఆశ్రయించాయి. గ్రూపు సభ్యులు పొదుపు ఖాతాలో దాచుకున్న సొమ్ము సైతం బ్యాంకు సిబ్బంది ఫోర్జరీ సంతకాలతో కాజేసి పంచుకున్నారని ఫిర్యాదు చేశారు.  కలికిరి మండలం మజ్జిగ వాండ్లపల్లికి చెందిన గణేష్ స్వయం సహాయక సంఘం తమకు రుణం కావాలని బ్యాంకు అధికారులు కోరారు. ఇటీవలే ఈ సంఘానికి రూ.10 లక్షల రుణం ఇచ్చినట్లు తెలపడంతో సభ్యులకు అనుమానం వచ్చింది. ఈ రుణాన్ని తమ గ్రూపు తీసుకోలేదని ఎవరికి ఇచ్చారో చెప్పాలని సంఘ సభ్యులు బ్యాంకు సిబ్బందిని నిలదీశారు. కలికిరి పట్టణానికి చెందిన గుల్జార్ బేగం ఫిక్స్​డ్​ డిపాజిట్లు రూ .8 లక్షలు కూడా స్వాహా చేశారు. బాండ్లు ఆమె దగ్గర ఉండగానే నగదు డ్రా అయినట్లు స్టేట్​మెంట్ ఇచ్చారు. ఈ విధంగా బ్యాంకు సిబ్బంది చేతివాటంతో పలువురు ఖాతాల నుంచి రూ.3 కోట్ల వరకు సొమ్ము స్వాహా అయినట్లు సమాచారం. 


పోలీసులు విచారణ


మూడు కోట్ల కుంభకోణంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే మేనేజర్ వెంకట మద్దిలేటితోపాటు మరో అయిగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్యాంకు సిబ్బందిపై బాధిత మహిళలు దాడి చేస్తారన్న అనుమానంతో బ్యాంక్ వద్ద భద్రతను పెంచారు. బ్యాంకు సిబ్బంది కొంప ముంచారని బాధిత మహిళలు తీవ్రంగా రోధిస్తున్నారు. 


 


Also Read: Mohana Bhogaraju: మనోహరి నుంచి బుల్లెట్ బండి పాట వరకూ ఆమె ప్రయాణం ఎలా సాగింది..బుల్లెట్ బండి ఆలోచనకు మూలం ఏంటి..ఎవరీ మోహనా భోగరాజు..