Gudivada News :   మెగాస్టార్ చిరంజీవిపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్లు చేశారని  చిరంజీవి అభిమానులు బుధవారం ఆందోళనకు దిగారు. చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ  ట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ‘జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో చిరంజీవి అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


గుడివాడలో చిరంజీవి అభిమానుల భారీ నిరసన                 


పోలీసు వాహనాలకు అడ్డంగా చిరంజీవి అభిమానులు పడుకుని నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.    ని ఏజీకే స్కూల్‌ సెంటర్లో విజయవాడ మెయిన్‌రోడ్డుపై చిరంజీవి అభిమానులు బైఠాయించారు. వంగవీటి మోహనరంగా విగ్రహానికి క్షీరాభిషేకాలు చేశారు. చిరంజీవి, రంగా అభిమానుల ఓట్లతో గెలిచిన కొడాలి నానీకి 2024 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గుడివాడలో సామాజిక సమీకరణాల రీత్యా..  చిరంజీవిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చిరంజీవి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని అంత మాత్రానికే ఇష్టానుసారంగా మాట్లాడతారా అని ప్రశ్నిస్తున్నారు. 


పంచాయతీ నిధుల మళ్లింపుపై ఏపీ బీజేపీ పోరుబాట - గురువారం కలెక్టరేట్ల ముందు ధర్నాలు
 
కొడాలి నాని ఏమన్నారంటే?                                         


‘సినిమా పరిశ్రమలోని పకోడిగాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారంటూ’ ఆయన వ్యాఖ్యానించారు.   సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లు పకోడీగాళ్లు.. ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. తనవాళ్లకు కూడా ఈ సలహాలు ఇస్తే బావుంటుందన్నారు. మనకెందుకురా బాబు మన డ్యాన్సులు, ఫైట్లు మనం చూసుకుందామని వాళ్లకు కూడా సలహా ఇస్తే మంచిదన్నారు కొడాలి నాని.                       


కేసులపై చంద్రబాబు కౌంటర్- సాగునీటి విధ్వంసంపై సమాధానాలని సవాల్


చిరంజీవి ఏమన్నారంటే ?                                                      


వాల్తేరు వీరయ్య ఫంక్షన్ లో.. చిరంజీవి మాట్లాడుతూ సినిమా రంగంపై రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్ పై స్పందించారు. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, పేదవారు, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి అంటూ ఘాటుగానే స్పందించారు.