Pakistan Parliament: 



పార్లమెంట్ రద్దు..


పాకిస్థాన్ పార్లమెంట్ నేడు (ఆగస్టు 9) రద్దయ్యే అవకాశాలున్నాయి. ఆగస్టు 12న ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగియనుంది. ఇదే విషయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. త్వరలోనే దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే...పార్లమెంట్‌ని రద్దు చేయాలంటూ పాక్ ప్రధాని షెహబాజ్ రాష్ట్రపతికి లేఖ రాయనున్నారు. పాకిస్థాన్ మీడియా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 


"మా ప్రభుత్వ పదవీ కాలం ముగిసిపోనుంది. రాష్ట్రపతికి ఓ లేఖ రాస్తాను. నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలని ఆ లేఖలో కోరతాను. ఆ తరవాత మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది"


- షెహబాజ్ షరీఫ్, పాకిస్థాన్ ప్రధాని


వీడ్కోలు..


పదవీ కాలం ముగిసిపోయే ముందు షెహబాజ్ ఇటీవలే రావల్‌ పిండిలోని పాకిస్థాన్‌ ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌కి వెళ్లారు. అక్కడ అందరికీ వీడ్కోలు పలికారు. ఈ పర్యటనతో అధికారికంగా పదవీ కాలం ముగిసిపోయినట్టు సంకేతాలిచ్చారు. అయితే..పాకిస్థాన్ రాష్ట్రపతి అల్వి ఈ రద్దు ప్రక్రియను కాస్త ఆలస్యం చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అందుకే...ఎలాంటి జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా నేషనల్ అసెంబ్లీని రద్దు చేసేలా చొరవ తీసుకుంటున్నారు పాక్ ప్రధాని. 90 రోజుల్లోగా ఎన్నికలు జరిగేలా పాకిస్థాన్ ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వంలోని ప్రధాన పార్టీలు పార్లమెంట్ రద్దు చేయాలనుకున్నారు. తొలుత ఆగస్ట్ 9, లేదా 10 తేదీలలో పార్లమెంట్ ను రద్దు చేయాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికార కూటమి నేతలతో చర్చించారు. కానీ దిగువ సభను రద్దు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే విషయాలపై సైతం చర్చ జరిగింది. సుదీర్ఘ ఆలోచనల తరువాత ఆగస్టు 8న పాక్ పార్లమెంట్ రద్దు చేయాలని ప్రభుత్వం భావించిందని నివేదికలు పేర్కొన్నాయి. 


ప్రధాని రేసులో ముగ్గురు..? 


గతంలో బిలావల్ జర్దారీ- భుట్టో నేతృత్వంలోని PPP నిర్ణీత పదవీ కాలానికి ముందే పార్లమెంట్ రద్దు చేసింది. కానీ పార్లమెంట్ రద్దుకు తేదీ ఖరారు చేయలేదని సమాచార మంత్రి మర్రియం ఔరంగజేబ్ అన్నారు. అయితే ప్రభుత్వ కూటమిలో ప్రధాన పార్టీలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పిన తరువాత ప్రధాని ముందస్తుకు వెళ్లాలనుకున్నట్లు ప్రకటించారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడే వరకు షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా కొనసాగుతారు. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడిపించేందుకు ప్రధానిగా సూచించేందుకు తనతో సహా మొత్తం 3 పేర్లను ప్రతిపక్ష నేత రాజా రియాజ్‌కు షెహబాబ్ లేఖ రాయనున్నారు.


ఇమ్రాన్ అరెస్ట్..


పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహ్రెక్ - ఎ - ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan Arrest) అరెస్టు అయ్యారు. ఆయన్ను ఇస్లామాబాద్‌ హైకోర్టు బయట పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పీటీఐ లాయర్ ఫైసల్ చౌదరి ధ్రువీకరించినట్లుగా అక్కడి వార్తా పత్రిక డాన్ వెల్లడించింది. అవినీతి ఆరోపణల కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేశారు. 


Also Read: US Girl: 10 ఏళ్లకే బాలికకు పెళ్లి చేసిన తల్లిదండ్రులు, అసలు విషయం తెలిస్తే కన్నీరు ఆగదు