ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గంపై ( New Cabinet ) కసరత్తు చివరి క్షణం వరకూ కొనసాగుతుందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala ) స్పష్టం చేశారు. ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ అన్ని కాంబినేషన్స్ పై వర్కవుట్ చేస్తున్నారని... లిస్ట్ ఫైనల్ అయ్యాక కాబోయే మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఫోన్ చేసి చెబుతారన్నారు. బీసీలకు ప్రాధాన్యత ఉండేలా నిర్ణయం తీసుకున్నామని.. ఆదివారం మధ్యాహ్నానికి జాబితా ఖరారయ్యే అవకాశం ఉంది. మహిళలకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని.. పాత, కొత్త కలయికతో మంత్రి వర్గ కూర్పు ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో రెండు రోజుల పాటు విస్తృతంగా జరిగిన చర్చల్లో సజ్జల పాల్గొన్నారు. మంత్రుల వద్ద రాజీనామాలు తీసుకున్న తర్వాత పరిస్థితులు... కేబినెట్‌లో చేయాల్సిన మార్పు చేర్పులపై చర్చించారు.
జేగ్యాంగ్ లో పెద్దిరెడ్డే అవినీతి అనకొండ - మంత్రులపై బొండా ఉమా సంచలన ఆరోపణలు
మంత్రుల వద్ద రాజీనామా లేఖలు తీసుకున్నప్పటికీ ఇంకా గవర్నర్‌కు ( Governer ) పంపలేదు. కొత్త మంత్రుల జాబితాతో పాటు ఎవరెవర్ని తొలగించాలో వారి రాజీనామా పత్రాలను మాత్రమే గవర్నర్‌కు పంపే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న మంత్రులందర్నీ తొలగించడం లేదు. కనీసం పది మంది సీనియర్ మంత్రులను కొనసాగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా వారి రాజీనామాలను గవర్నర్‌తో ఆమోదింప చేసి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయించడం ఎందుకని.. కేవలం తొలగించాలనుకున్న వారి రాజీనామా పత్రాలను మాత్రం గవర్నర్‌కు పంపితే సరిపోతుందని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ( CM Jagan ) ఆలోచన ఎలా ఉందో స్పష్టత లేదు. అయితే ఇప్పటి వరకూ గవర్నర్‌కు ఎలాంటి లేఖలు పంపలేదు.
ఏపీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్, ఎప్పుడంటే?
మంత్రివర్గ సభ్యులను జగన్ ఖరారు చేసుకున్నారని అయితే ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ముందుగానే ప్రకటించడం వల్ల సమస్యలు వస్తాయని.. అందుకే కసరత్తు జరుగుతోందని సజ్జల చెబుతున్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం జగన్‌పై అనేక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ.. తాను అనుకున్న సామాజిక సమీకరణాలతోనే కేబినెట్ కూర్పును జగన్ చేసుకుంటారని చెబుతున్నారు. సోమవారం ఉదయం వెలగపూడిలో మంత్రుల ప్రమాణస్వీకారం జరగనుంది. అందుకే రేపు సాయంత్రానికి మంత్రులెవరో తెలియనుంది. స్వయంగా కొత్త మంత్రులకు ఫోన్ చేసి చెప్పనున్నారు.