CM Chandrababu Naidu : విజయవాడను ముంచెత్తిన వరదలకు కారణం బుడమేరకు గండ్లు పడటం. అవి చిన్న చిన్న గండ్లు కాదు. ప్రవాహం ఉన్నప్పుడు వాటిని పూడ్చాలంటే..అసాధ్యం. అది  పూడ్చకపోతే విజయవాడకు ముంపు ఆగదు. అందుకే .. బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చడానికి ప్రభుత్వ యంత్రాంగం చేయని ప్రయత్నం లేదు. మొదటి రెండు గండ్లను సులువుగానే పూర్తి చేసినప్పుడు మూడో గండిని  పూడ్చడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. 


బుడమేరు గండ్లు పూడ్చడానికి ఆర్మీ వచ్చినా ఫలించని ప్రయత్నాలు 


విజయవాడ వరద బాధిత ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పరిస్థితిని వివరించడంతో ఆర్మీని తెప్పించేందుకు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి ఆపరేషన్లలో అనుభవం ఉన్న ఆర్మీ బృందం విజయవాడ వచ్చింది. బుడమేరులో గండి పూడ్చే ప్రయత్నాల్లో పాల్గొంది. అయితే ఆర్మీ అధికారులకు అది కొరుకుడుపడలేదు. కొన్ని సలహాలు ఇచ్చి వారు వెళ్లిపోాయరు. అయితే బుడమేరు గట్టు మీదనే ఉంటూ.. మంత్రి నిమ్మల రామానాయుడు .. ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. 


వైసీపీ పాలన సైడ్ ఎఫెక్టులే - దోపిడీ తప్ప ఒక్క పనీ చేయలేదు - చంద్రబాబు ఘాటు విమర్శలు


యుద్ధమే చేసిన రామానాయుడు, అధికారులు


ఓ వైపు ఆగని వర్షం.. తరచూ పెరిగే వరదతో.. యుద్దం చేస్తూ.. గండి పూడ్చేపనులు కొనసాగించారు. కొన్ని ప్రైవేటు సంస్థల వాహనాలతో.. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు విస్తృత ప్రయత్నాలు చేశారు. చంద్రబాబునాయుడు చెప్పినట్లుగా యుద్ధమే చేశారు. ఫలితంగా చివరికి గండి పూడ్చగలిగారు. వదలను ఆపారు. అయితే అంతటితో వదిలేస్తే.. మళ్లీ గండి పడే ప్రమాదం ఉందని.. మరింత ఎత్తుగా కట్టను బలోపేతం చేసే వరకూ పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. 


నన్ను తిడితే అభిమానులకు కోపం రాదా? టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో మరోసారి జగన్ సంచలన కామెంట్స్


బుడమేరుతో విజయవాడకు పెను ముప్పు 


అధికారులు, మంత్రి రామానాయుడు చేసిన ప్రయత్నాలను ఏలూరు పర్యటనలో చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆర్మీ కూడా వల్ల కాలేదని చెబితే.. మంత్రి రామానాయుడు, ఇరిగేషన్ శాఖ అధికారులే యుద్ధం చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు.. అధికారులు చేసిన కృషిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అత్యంత ప్రమాదకరంగా మారిన బుడమేరకు మరోసారి వరదలు   రాకుండా చేసేందుకు రీటైనింగ్ వాల్ కూడా కట్టే ఆలోచన చేస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.       


చంద్రబాబునాయుడు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.  పది రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్ లోనే మకాం వేసి... బస్సులోనే  విశ్రాంతి తీసుకుని.. సహాయ చర్యలను పరిశీలించారు. విజయవాడ సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతనే ఆయన ఉండవల్లి నివాసానికి వెళ్లారు.