Chandrababu On YSRCP :  వైఎస్ జగన్ పాలనా నిర్వాకం వల్లనే వరదలు వచ్చాయని చంద్రబాబు మండిపడ్డారు.  కొల్లేరు ,తమ్మిలేరు  పరివాహక ముంపు ప్రాంతాలను  సీఎం చంద్రబాబు పరిశీలించారు.  గత ఏడాదిలోనే బుడమేరుకి గండ్లు పడితే కనీసం పట్టించుకోకపోవడం వల్లనే సమస్యలు వచ్చాయన్నారు.  టీడీపీ ప్రభుత్వంలో  బుడమేరు ఆధునీకరణ కోసం మంజూరు చేసిన పనులను రద్దు చేశారనిమండిపడ్డారు.  బుడమేరు మొత్తం  జగన్  మనుషులు ఆక్రమించుకుని అమ్మేశారని..  నీళ్ళు పోవాల్సిన బుడమేరుని కబ్జా చేసి విజయవాడను మంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని కనీసం పట్టించుకోలేదు !            


గత ఐదేళ్లలో వైఎస్ఆర్‌సీపీ  చేసిన పాపాలే.. రాష్ట్రానికి శాపాలుగా మారాయని  చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరు గండ్లు పూడ్చివేత విషయంలో  ఆర్మీ సైతం చేతులెత్తేసినా  ఏపీ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఆధికారులను, మంత్రి నిమ్మల రామానాయుడు పట్టుబట్టి పూర్తి చేశారని చంద్రబాబు అభినందించారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క సారి కూడా బుడమేరు పూడిక తీయలేదని గుర్తు చేశారు. గతంలో వచ్చిన వర్షాలకు గండ్లు పడినా పూడ్చలేదన్ననారు.  బుడమేరు వాగు పరిధిలో గత ప్రభుత్వం అక్రమార్కులను ప్రోత్సహించిందని చంద్రబాబు ఆరోపించారు.  అక్రమ కట్టడాలకు తప్పుడు దారిలో అనుమతులిచ్చిందన్నారు. వాతావరణ మార్పుల వల్ల  కుండపోత వర్షాలు, వరదలు  వస్తున్నాయని..  ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వరదల ప్రభావం తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. 


నన్ను తిడితే అభిమానులకు కోపం రాదా? టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో మరోసారి జగన్ సంచలన కామెంట్స్


దోచుకుని దాడులు చేసింది కాక అరెస్టు చేయవద్దని అంటున్నారు ! 


ప్రకాశం బ్యారేజీకి కొట్టుకు వచ్చిన బోట్ల విషయంపైనా చంద్రబాబు స్పందించారు.  ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు  కృష్ణా నదిలో బోట్లు వదిలి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వదిలిపెట్టిన నాలుగు బోట్లు వైసీపీ వాళ్లవేనని..  ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి ఆ పార్టీ వాళ్లు ఉద్దేశపూర్వకంగానే వాటిని నదిలో వదిలిపెట్టారని  చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయని..  ఒక దానిని మరొకటి చైన్లతో కట్టి నదిలో వదిలి పెట్టారని..ఇదంతా  ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు.  దాడులు చేసిన వారిని అరెస్టు చేయవద్దంటున్నారని మండిపడ్డారు.         


ఆక్రమణదారులు జైలుకే- స్వచ్చందంగా వదలుకోకుంటే చర్యలు తప్పవు- హైడ్రాపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్                 


క్రిమినల్ పై రాజకీయాలు చేయడం నామోషీగా ఉంది  !     


ఇసుక అక్రమ రవాణాకు ఉపయోగించే బోట్లను వారు వదిలారన్నారు. ఆ బోట్లు టీడీపీ వాళ్లవేనని రివర్స్ ప్రచారం చేస్తున్నారని.. జగన్ మోహన్రెడ్డి లాంటి క్రిమినల్ పై రాజకీయాలు చేయడం నామోషీగా ఉందన్నారు. ప్రజల కోసమ తాను భరిస్తున్నానని..   రౌడీలు, గూండాలను తాను ఎన్నడూ సహించలేదని, సామాన్యులకు ఇబ్బంది కలిగించే వారిపట్ల తానెప్పుడూ కఠిన వైఖరినే అవలంభిస్తానని ప్రకటించారు.