AP BJP On TTD : తిరుమలలో వసతి గదుల అద్దెను పెంచడంపై ఏపీ బీజేపీ మండిపడింది. టీటీడీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్ల ముందు నిరసన చేపట్టారు. తిరుమలలో భక్తుల వసతి గదుల రేట్లను టి.టి.డి పెంచడాన్ని నిరసిస్తూ రాజమండ్రిలో కలెక్టరేట్ ఎదుట బి.జె.పి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధర్నా చేశారు. ఇతర బిజేపీ నేతలు అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా చేశారు. టీటీడీ అధికారులు పెంచిన రేట్లను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ అవలంభిస్తున్న వైఖరి మానుకోవాలని నినాదాలు చేశారు. టిటిడి అద్దె గదుల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ కాలెక్టర్రేట్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ఆందోళన చేశారు. ఆందోళన లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయల పట్ల చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తమ కష్టాలను దేవుడు కి చెపుకోవడానికి తిరుమల వస్తే వారిని ఇబ్బంది పెడతారా? వసతి గదుల రేటు పెంచి తే భక్తులు ఎక్కడ వుంటారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది. సామాన్యుల పై విపరీతంగా ఆర్ధిక భారం మోపడం బీజేపీ ఖండిస్తుందన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తిరిగి తీసుకోవాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
కొండపై ఉన్న వసతి గదులు ఇప్పుడు ఖరీదుగా మారిపోయాయి. సామాన్య భక్తులు ఒక రోజు ఉండి దర్శనం, మొక్కులు తీర్చుకునేందుకు నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వసతి గృహాల్లో ఉంటుంటారు. గతంలో ఈ వసతి గృహాల్లో 500 నుంచి 600 రూపాయలు అద్దె ఉండేది. కాని ప్రస్తుతం జీఎస్టీతో కలిపి 1౬00 రూపాయలకు పెంచారు. నారాయణగిరి రెస్ట్ హౌస్‌లో కూడా 1,2,3గదులను 150-250ఉండే అద్దెను జీఎస్టీతో కలిపి 1700రూపాయలకు పెంచారు. ఇక రెస్ట్ హౌస్‌లోని 4లోని ఒక్క గది అద్దె 750ఉండగా దానికి వెయ్యి రూపాయలు అదనంగా పెంచి 1700 చేశారు. ఇక కార్నర్ సూట్‌ను జీఎస్టీతో కలిపి 2200రూపాయలు, స్పెషల్ టైప్ కాటేజీల్లో 750రూపాయల గదిని 2800రూపాయలకు పెంచి భక్తులపై మోయలేని భారం మోపింది టీటీడీ.
ఈ గదులను అద్దెకి తీసుకోవాలంటే అంతే మొత్తం డిపాజిట్ గా చెల్లించాలి. గదుల అద్దెలు పెంచి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్న టీటీడీ పాలక మండలి నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులను ఇలా నిలువు దోపిడీ చేయడం ఎంతవరకూ సబబు అంటున్నారు. దీనపై ఏపీ బీజేపీ ఆందోళనకు దిగింది. శ్రీశైలం దేవస్ధానం ప్రసాదాల కోసం వాడే వస్తువుల సరఫరా కాంట్రాక్టులో అవినీతిపై విచారణ చేయాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తోంది.
సీఎం జగన్ ఏమన్నారని ఆ బాలీవుడ్ సింగర్ విమర్శించారు ? కావాలని రెచ్చగొట్టారా ?