APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీకోసం ఇచ్చిన పండగ ఆఫర్ ఇదే

ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందింది. ముందస్తు రిజర్వేషన్ల గడువును పెంచారు. 

Continues below advertisement

ఏపీఎస్ఆర్టీసీలో ఇక దూర ప్రాంత ప్రయాణికులకు ముందస్తు రిజర్వేషన్ గడువును పెంచారు. ముందస్తు రిజర్వేషన్ 60 రోజులకు పెంచుతున్నట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. డిసెంబర్ 2 నుంచి ఈ మార్పులు అమ్మల్లోకి రానున్నాయి. ప్రయాణానికి 30 రోజుల ముందు బస్సుల్లో సీట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే గురువారం నుంచి.. 60 రోజుల ముందు నుంచి సీట్లు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించింది ఏపీఎస్ఆర్టీసీ. 

Continues below advertisement

క్రిస్మస్, సంక్రాంతి పండగల కారణంగా.. ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. పండగ సీజన్ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాల మధ్య తిరిగే బస్సులతోపాటు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య తిరిగే బస్సులకు ఇది వర్తిస్తుంది.

ఏపీఎస్ఆర్టీసీ పండుగ సీజన్లో ప్రయాణికులకు ఇది మంచి అవకాశం కానుంది. ముఖ్యంగా అడ్వాన్స్ టికెట్ల బుకింగ్స్ చేసుకునే వారికి దీనితో ప్రయోజనం. పండుగ సీజన్ కారణంగా టికెట్స్ దొరుకుతాయో.. లేదోననుకునే.. వారికి ఇది ఎంతో ఉపయోగం. ప్రయాణికులు ఇప్పటినుంచే టికెట్లకు ఎగబడే అవకాశముంది.

కరోనా కారణంగా జనం ప్రయాణాలు చేసేందుకు రెండేళ్లుగా ఇష్టపడలేదు. ఈ ప్రభావం ఆర్టీసీ మీద ఎక్కువగానే పడింది.  ఈ సంవత్సరం దసరా సీజన్ లో నష్టాల నుంచి కాస్త కోలుకుంది ఆర్టీసీ. సంక్రాంతి సమయానికి కొవిడ్ భయం తగ్గి..  ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అంచనా వేస్తోంది.

Also Read: Omicron Travel Rules: భారత్‌కు వస్తున్నారా? అయితే ఈ 10 పాయింట్లు పక్కా గుర్తుంచుకోండి!

Also Read: Petrol Price: తగ్గిన పెట్రోల్ ధరలు.. వాహనదారులకు బంపర్ ఆఫర్.. వ్యాట్ తగ్గించిన సర్కార్

Also Read: Govt on Farmers Protests: 'ప్చ్.. రైతులు చనిపోయారా? మాకు తెలియదే.. పరిహారం ఎలా ఇస్తాం?'

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదు, 267 మంది మృతి

Also read: నాలుగు రోజులుగా సిరివెన్నెల ప్రాణం నిలిచింది ‘ఎక్మో’పైనే... ఎక్మో అంటే? అదెలా ఆయన ప్రాణాలు నిలిపింది?

Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు

Also Read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Continues below advertisement
Sponsored Links by Taboola