Breaking News Live Telugu Updates: హైదరాబాద్ కు చేరుకున్న కేజ్రీవాల్, భగవంత్ మాన్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 17 Jan 2023 11:08 PM
హైదరాబాద్ కు చేరుకున్న కేజ్రీవాల్, భగవంత్ మాన్

హైదరాబాద్ కు చేరుకున్న కేజ్రీవాల్, భగవంత్ మాన్


హైదరాబాద్: రేపు ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు హాజరయ్యేందుకు ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో వారికి ఆప్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున హోంమంత్రి మహమూద్ అలీ కేజ్రివాల్, భగవంత్ మాన్ ను రిసీవ్ చేసుకున్నారు...

హైదరాబాద్‌కు చేరుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు

సికింద్రాబాద్..   బుధవారం ఖమ్మంలో జరిగే బిఆర్ఎస్ పార్టీ సీఎం కెసిఆర్ బహిరంగ సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరుకానున్నారు.  ఢిల్లీ సీఎం రానున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు  హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

గొల్లపూడి టీడిపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత

గొల్లపూడి టీడిపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత.


వన్ సెంటర్లో పార్టీ ఆఫీసుకు తాళాలు వేసేందుకు యత్నిస్తున్న పోలీసులు..
కార్యాలయం వద్ద భారీగా మోహరించిన  పోలీసు బలగాలు, 
రేపు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాల నిర్వహణకు  ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు..


ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను అడ్డుకునే దిశగా అడుగులు..
సంఘటన స్థలానికి చేరుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా, 
కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్న  పార్టీ శ్రేణులు

నల్గొండలో దారుణం: తీవ్ర రక్తస్రావంతో అత్యాచార బాధితురాలు మృతి

నల్గొండ : పీఏపల్లి (మం)అంగడిపేట లో దారుణం చోటుచేసుకుంది..
ఓ యువతిపై దిలీప్ అనే యువకుడు అత్యాచారం...
తీవ్ర రక్తస్రావంతో యువతి మృతి చెందింది...
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు..

జగన్ ఒక సైకో, ఆయనకు బుద్ధి చెప్పాలి: మాజీ మంత్రి కొండ్రు మురళి

విశాఖ... టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళి కామెంట్స్..


రాష్ట్రంలో దళితులకు జగన్ సర్కార్ అపకారం చేస్తోంది


దళిత ద్రోహి సీఎం జగన్


ఎస్సీ, ఎస్టీల మీదే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత జగన్ దే


ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వైసిపి సర్కార్ మళ్లిస్తోంది


ఎస్సీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు


టీడీపీ హయాంలోనే రెసిడెన్షియల్ స్కూల్ ను ఎన్టీఆర్ ప్రారంభించారు


ఎస్సీ, ఎస్టీలకు జగన్ ఎంత అన్యాయం చేశారో..అంకెలు తో సహా చెబుతాము


జీవో  నెం. 77 తెచ్చి.. ఎస్సీ, ఎస్టీ పిల్లలకు స్కాలర్ షిప్, ఫీజ్ రియంబర్స్ మెంట్ లేకుండా జగన్ సర్కార్ తెచ్చింది


ఎస్సీ, ఎస్టీల డిపట్టాలను లాక్కుకున్నారు


ఎస్సీ, ఎస్టీలను జగన్ తీవ్రమైన మోసం చేస్తున్నారు...అయినా 
ఎస్సీ, ఎస్టీల మంత్రులు,వైసిపి నేతలు మాట్లాడడం లేదు


28 పధకాలను తొలగించారు..టిడిపి అధికారంలోకి రాగానే అమలు చేస్తాము


బ్యాక్ లాక్ పోస్టులు భర్తీ చేయడం లేదు


జగన్ ఒక సైకో...ఆయనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉంది

Ali on Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై నటుడు అలీ హాట్ కామెంట్స్

నటుడు, వైఎస్ఆర్ సీపీ నాయకుడు అలీ సంచలన కామెంట్స్ చేశారు. తాను 2024లో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సిద్ధం అని అన్నారు. పార్టీ ఆదేశిస్తే పవన్ కల్యాణ్ పై పోటీకి కూడా తాను రెడీ అన్నారు. పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడే అని, కానీ స్నేహం వేరు రాజకీయాలు వేరు అని చెప్పారు. 2024లో వైఎస్ఆర్ సీపీ 175కు 175 సీట్లు కచ్చితంగా గెలుస్తుందని జోస్యం చెప్పారు. 

Visakhapatnam Kirandul Express: కొత్త వలస సమీపంలో పట్టాలు తప్పిన రైలు

08551 విశాఖపట్నం-కిరండూల్ రైలుకు చెందిన జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ (రైలు వెనుక నుండి 6వది) కొత్తవలస-అరకు సెక్షన్‌లోని శివలింగపురం స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఆ కోచ్‌లోని ప్రయాణికులందరినీ ఇతర కోచ్‌లకు తరలించగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. DRM అనుప్ సత్పతి తన అధికారుల బృందంతో కలిసి వెంటనే యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ట్రైన్‌లో పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడానికి స్థలానికి చేరుకున్నారు. పట్టాలు తప్పిన కోచ్‌ను విడిచిపెట్టిన తర్వాత, మిగిలిన ప్రయాణీకులందరితో మిగిలిన రైలు ముందుకు ప్రయాణానికి బయలుదేరింది.

తార్నాకలో నలుగురి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయటికి

  • తార్నాకలో నలుగురి ఆత్మహత్య కేసులో కొనసాగుతున్న పోలీసుల విచారణ 

  • చెన్నైకి చెందిన ప్రతాప్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తింపు 

  • భార్య సింధూర, నాలుగేళ్ల బాలిక ఆధ్యా, ప్రతాప్ తల్లి జయతిని ప్రతాప్ హత్య చేసినట్లు గుర్తింపు

  • కరెంట్ వైరుతో గొంతు నులిమి ముగ్గురిని హత్య చేసిన ప్రతాప్

  • అనంతరం తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు క్లూస్ సేకరించిన పోలీసులు

  • హైదరాబాద్ నుండి చెన్నైకు కుటుంబాన్ని మార్చాలని వ్యవహారంపై భార్యాభర్తల మధ్య గొడవ

  • చెన్నైకు వెళ్లడానికి నిరాకరించిన భార్య సింధూర

  • ఇద్దరు మధ్య గత వారం రోజులుగా గొడవలు 

  • కుటుంబ కలహాలతోనే ముగ్గురుని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ప్రతాప్

  • చెన్నైలోని కార్ల షోరూంలో డిజైనర్ మేనేజర్ గా పనిచేస్తున్న ప్రతాప్

  • హైదరాబాదులోని బ్యాంక్ ఆఫ్ బరోడా లో మేనేజర్ గా పనిచేస్తున్న సింధూర

Anantapur Lockup death: అనంతపురం లాకప్ డెత్ ఘటనపై ఎస్పీ ఫకీరప్ప స్పందన

* అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతిపై జిల్లా ఎస్పీ కాగినల్లి ఫకీరప్ప స్పందన


* రామాంజనేయులు అనే దొంగ తాను ధరించిన లుంగీతో ఉరి వేసుకొని జైలులో ఆత్మహత్య


* దొంగలను లాకప్ లో ఉంచకుండా కంప్యూటర్ రూంలో ఉంచి విధులలో నిర్లక్ష్యం వహించిన రాయదుర్గం అర్బన్ సీఐ శ్రీనివాసులు కానిస్టేబుల్ గంగన్న, మధులతోపాటు హోంగార్డ్ రమేష్ లను సస్పెండ్ చేశాము.


* నేషనల్ హ్యూమన్ రైట్స్ నిబంధనలను అనుసరించి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ తో పోస్టుమార్టం నిర్వహిస్తున్నాం.


* జ్యుడీషియల్ విచారణ చేయాల్సిందిగా ఆర్డీవోని కోరతాం.


* విచారణలో ఇంకా ఎవరైనా పోలీసు అధికారి నిర్లక్ష్యం బయటపడితే వారి మీద కూడా చర్యలకు వెనకాడబోం

Lockup Death: రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్

  • అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్

  • రాయదుర్గం పట్టణం సమీపంలో గొర్రెల దొంగతనానికి వచ్చిన ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి

  • రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో నుంచి శవాన్ని స్థానిక కమ్యూనిటీ ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు

  • ఘటన స్థలాన్ని సందర్శించిన కళ్యాణ దుర్గం డీఎస్పీ శ్రీనివాసులు

  • ఈ ఘటనతో సీఐ శ్రీనివాసులు, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ పకీరప్ప

Background

బంగాళాఖాతంలో ప్రస్తుతం ఎలాంటి అల్పపీడనం, వాయుగుండం లాంటివి ఏమీ లేవు. కానీ, శ్రీలంకను ఆనుకొని ఓ ఉపరితల ఆవర్తన ప్రాంతం మాత్రం ఉంది. ఇది తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో వచ్చే 5 రోజులు ఎలాంటి వర్షాలు ఉండే అవకాశం లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. పశ్చిమ గాలుల ప్రభావం బలపడుతుండడంతో పొడిగాలులు తమిళనాడు, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో అధికంగా ఉంటాయని చెప్పారు. కాబట్టి, ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని, కానీ తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా సాధారణంగా చలి ఉంటుందని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.


ఇటు విజయవాడలోనూ పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెదర్ బులెటిన్ లో తెలిపారు. నగరంలో పొగ మంచు కూడా ఏర్పడుతుందని తెలిపారు.


ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. సోమవారం (జనవరి 16) నుంచి మూడు రోజుల పాటు మరో కోల్డ్‌ స్పెల్‌ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అంటే మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. వరుసగా కొన్ని రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే దీనిని ఓల్డ్‌ స్పెల్‌గా వ్యవహరిస్తారు. ఈ నెల 5 నుంచి 9 తేదీల మధ్య ఏర్పడిన కోల్డ్‌ స్పెల్‌లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో ఇంతటి తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది రెండోసారి.


రానున్న 5 రోజుల్లో ఢిల్లీతోపాటు పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల జనవరి 18 వరకు ఆయా ప్రాంతాల్లో రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. వదులుగా, పొరలుపొరలుగా ఉండే దుస్తులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. జనవరి 18 తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ అధికారి ఒకరు చెప్పారు.


తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎల్లో నేడు కూడా అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో చలి సాధారణంగానే ఉండనుంది. పశ్చిమ తెలంగాణ జిల్లాలు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో చలి గాలులు కూడా పెరుగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. కేవలం దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. సాధారణంగా 11 నుంచి 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.


హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 32.1 డిగ్రీలు, 17.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 


హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.