Breaking News: చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి. పూతలపట్టు మండలం తుంబవారిపల్లెలో భూమి కంపించడంతో స్థానికులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామానికి బయలుదేరారు. వారం క్రితం ముదిగుబ్బలో భూప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
సిరిసిల్ల పట్టణంలో ఇటీవల మానేరు నదిలో పడి మృతిచెందిన ఆరుగురు విద్యార్థుల కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. ఒక్కొక్కరికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతకు ముందు ప్రమాదం జరిగిన ప్రాంతానికి స్థానిక బీజేపీ నేతలతో కలిసి వెళ్లి పరిశీలించారు. అక్కడ ఇసుక కారణంగా ఏర్పడిన గుంతలు ప్రమాదానికి కారణమని స్థానిక నేతలు బండి సంజయ్ కి వివరించారు
రాజధాని అంశంపై సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. మళ్లీ పూర్తి సమగ్ర బిల్లుతో సభ ముందుకు వస్తామని తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.."ఒకప్పుడు కర్నూలు రాజధానికిగా ఉండేది. 1956లో కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్ కు తరలిపోయింది. నా ఇల్లు అమరావతిలోనే ఉంది. నాకు ఈ ప్రాంతం అంటే ప్రేమ ఉంది. కనీసం రోడ్లేసుకోవడానికి, కరెంట్ ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితి. చదువుకున్న మన పిల్లలు ఉద్యోగాల కోసం బెంగుళూరు, చెన్నై వెళ్లాల్సిందేనా..?. విశాఖలో ఇప్పటికే రోడ్లు, డ్రైనేజ్ లు , కరెంట్ ఉన్నాయి. విశాఖ మరో ఐదు, పదేళ్లలో హైదరాబాద్ వంటి నగరాలకు పోటీ పడే అవకాశం ఉంది. గత రెండేళ్ల నుంచి రాజధాని విషయంలో రకరకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వికేంద్రీకరణ బిల్లు అమల్లోకి వస్తే ఈ పాటికే మంచి ఫలితాలు అమల్లోకి వచ్చేవి.' అన్నారు.
హైదరాబాద్ వంటి సూపర్ క్యాపిటల్ వద్దే వద్దని ప్రజలు తెలిపారని సీఎం జగన్ తెలిపారు. అందుకే వికేంద్రీకరణ బిల్లుకు తీసుకోచ్చామని సీఎం జగన్ తెలిపారు. వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనుమానాలు, కోర్టు కేసులు వచ్చాయన్నారు. కొందరికి అన్యాయం జరుగుతుందనే వాదన ముందుకు తెచ్చారన్నారు. ప్రభుత్వ సదుద్దేశ్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, మళ్లీ పూర్తి సమగ్ర బిల్లుతో సభ ముందుకు తీసుకోస్తామని తెలిపారు. విస్తృత, విశాల అభిప్రాయాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. కాసేపట్లో సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉంది. నేడు ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల అంశంపై కీలక చర్చ జరగనుంది. సీఆర్డీఏ రద్దు బిల్లును ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ సమీపంలో విద్యార్థులతో వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 8 మంది స్టూడెంట్స్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను స్థానికులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో మొత్తం 20 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులంతా ముజాహిద్‌పూర్ మోడల్ స్కూలుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు రెండు రోజుల పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఉన్నారు. నేటి ఉదయం సత్యసాయిబాబా సమాధిని సీజేఐ దర్శించుకున్నారు. నేడు సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొననున్నారు.
రోజూ తాగి వచ్చి భర్త వేధిస్తుండడంతో ఓ భార్య తన సోదరుడి సాయంతో భర్తను హత్య చేసింది. హైదరాబాదులో ఉన్న తన సోదరుణ్ని పిలిపించుకొని ఆదివారం ఇద్దరు కలిసి హత్య చేశారు. బలంగా తలపై కొట్టి చంపేశారు. అనంతరం వారే పోలీసులకు లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు గన్నేర్ల శంకర్ హోటల్‌లో క్యాటరింగ్ పనులు చేస్తూ ఉండేవాడు. హత్య చేసినవారు గన్నేర్ల సుజాత (37) హోటల్ వర్కర్, జనప వెంకటరమణ (24), ప్రైవేటు ఉద్యోగి అని పోలీసులు తెలిపారు.
టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు దాదాపు ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ దిల్లీ పర్యటనకు వెళ్లే ముందు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పలువురు అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చినట్లు తెలిసింది. నేడు అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ అధిష్ఠానం అధికారకంగా ప్రకటించనున్నారు. నేడు, రేపు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్సీలకు చోటుదక్కలేదు. కల్వకుంట్ల కవితకు రాజ్యసభ సీటు కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నందలూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని తెలుసుకోనున్నారు. సోము వీర్రాజుతో పాటు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి, కిసాన్ మోర్చా ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి మరియు బిజేపి రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు... వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
Background
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నందలూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని తెలుసుకోనున్నారు. సోము వీర్రాజుతో పాటు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి, కిసాన్ మోర్చా ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి మరియు బిజేపి రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు... వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పుట్టపర్తికి చేరుకున్నారు. సోమవారం సత్యసాయి విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవంలో సీజేఐ పాల్గొననున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు అధికారులు, రాజకీయ ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. సీజేఐ పర్యటన సందర్భంగా పుట్టపర్తిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు దాదాపు ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ దిల్లీ పర్యటనకు వెళ్లే ముందు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పలువురు అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చినట్లు తెలిసింది. నేడు అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ అధిష్ఠానం అధికారకంగా ప్రకటించనున్నారు. నేడు, రేపు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్సీలకు చోటుదక్కలేదు. కల్వకుంట్ల కవితకు రాజ్యసభ సీటు కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
దక్షిణ అండమాన్ దాని పరిసర ప్రాంతాల మీద ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దక్షిణ అంతర్గత కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. వీటి ప్రభాతంలో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేశారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. రేపటి నుంచి రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురవనున్నాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా..
తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. కానీ మరో మూడు నుంచి నాలుగు రోజులపాటు తెలంగాణలో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. వాతావరణంలో పెద్దగా మార్పులేమీ ఉండవని, అంతా చల్లగా ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. నేడు సైతం హైదరాబాద్‌లో చిరు జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -